పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ మొసలి కన్నీరు..విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఫైర్

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ మొసలి కన్నీరు..విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఫైర్

హైదరాబాద్, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. శనివారం సీఎల్పీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు తమ ఉనికిని కాపాడుకోవడం కోసమే పాదయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. పాదయాత్రలు కాదు.. మోకాళ్లపై యాత్రలు చేసినా వారిని ప్రజలు నమ్మరని ఎద్దేవా చేశారు. పాలమూరు బిడ్డనే ఇప్పుడు సీఎంగా ఉన్నాడని, ఈ జిల్లా త్వరలోనే సస్యశ్యామలం అవుతుందన్నారు. 2027 డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకుసాగుతోందని తెలిపారు. భూ సేకరణ కోసం రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.