ఎవరీ రాహుల్ నార్వేకర్..? 

ఎవరీ రాహుల్ నార్వేకర్..? 

మహారాష్ట కొత్త స్పీకర్గా బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నార్వేకర్ ఎన్నికయ్యారు. మహావికాస్ అఘాడీ తరపున పోటీ చేసిన శివసేన ఎమ్మెల్యే రాజన్ సాల్వీపై రాహుల్ నార్వేకర్ గెలిచారు. రాహుల్కు 164 ఓట్లు రాగా, రాజన్ సాల్వీకు 107 మంది ఓటేశారు. ఈ ఓటింగ్కు ఎస్పీ, ఎంఐఎం పార్టీలు దూరంగా ఉన్నాయి.  స్పీకర్ ఎన్నిక పూర్తి కావడంతో అసెంబ్లీలో బలపరీక్ష జరగనుంది. మ‌హారాష్ట్రలో కొత్తగా కొలువుదీరిన ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం సోమ‌వారం (జూన్ 4న) త‌న బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది.

ఎవరీ రాహుల్ నార్వేకర్..?

రాహుల్ నార్వేకర్ రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన తండ్రి సురేష్ నార్వేకర్ ప్రస్తుతం కౌన్సిలర్ గా ఉన్నారు. ఎన్‌సీపీ సీనియర్ నేత రాంరాజే నాయక్ కు రాహుల్ నార్వేకర్ అల్లుడు. ప్రస్తుతం రాహుల్ నార్వేకర్ మహారాష్ట్రలోని కొలాబా అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన నార్వేకర్..2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. నార్వేకర్ గతంలో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలతో కలిసి పని చేశారు. 

2014లో శివసేన పార్టీ నుంచి రాజకీయ ఆరంగ్రేటం చేసిన నార్వేకర్..ఆ సమయంలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నించారు. కానీ, శివసేన ఆయనకు టిక్కెట్ నిరాకరించడంతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)లో చేరారు. ఆ ఎన్నికల్లో ఎన్సీపీ రాహుల్ నార్వేకర్‌ను మావల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీకి దింపింది. అయితే.. నార్వేకార్ ఆ ఎన్నికల్లో ఓటమి చెందారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన రాహుల్ నార్వేకర్.. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ జగ్తాప్‌పై విజయం సాధించారు.