హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌సీ పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదు.. హైకోర్టు ఆదేశం

హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌సీ పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదు.. హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు : స్టేట్‌‌‌‌‌‌‌‌ హ్యూమన్‌‌‌‌‌‌‌‌ రైట్స్‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌ చైర్మన్, ఇతర మెంబర్స్‌‌‌‌‌‌‌‌ పోస్టులను ఎం దుకు భర్తీ చేయలేదో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పాలని ఆదేశించింది.

హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌సీలో ఖాళీల కారణంగా 6 వేల కేసులు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయని  సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన లాయర్‌‌‌‌‌‌‌‌ అద్నాన్‌‌‌‌‌‌‌‌ మహమూద్‌‌‌‌‌‌‌‌ హైకోర్టులో పిల్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశారు. దీన్ని చీఫ్‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌ ఉజ్జల్‌‌‌‌‌‌‌‌ భూయాన్, జస్టిస్‌‌‌‌‌‌‌‌ తుకారాంజీల డివిజన్‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌ బుధవారం విచారించింది. గత ఏడాది డిసెం బర్‌‌‌‌‌‌‌‌22 నుంచి చైర్మన్, మెంబర్స్‌‌‌‌‌‌‌‌ పదవులు ఖాళీగా ఉన్నాయని పిటిషనర్‌‌‌‌‌‌‌‌ కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను కోర్టు జూన్‌‌‌‌‌‌‌‌ 30కి వాయిదా వేసింది.