భార్యను కాల్చి చంపిన భర్త అరెస్ట్..మల్కాజ్‌‌గిరి పోలీసుల అదుపులో నిందితుడు

భార్యను కాల్చి చంపిన భర్త అరెస్ట్..మల్కాజ్‌‌గిరి పోలీసుల అదుపులో నిందితుడు

పద్మారావునగర్, వెలుగు: భార్యపై అనుమానంతో తుపాకీతో కాల్చి చంపిన భర్తను మల్కాజ్‌‌గిరి పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుడి వద్ద దేశవాళీ పిస్టల్, బుల్లెట్లు, మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మల్కాజ్‌‌గిరి మారుతీనగర్‌‌కు చెందిన రియల్టర్  దామర అరుణ్ కుమార్‌‌ తో నిషా రాణి(35)కు వివాహం జరిగింది.

 కొంత కాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న అరుణ్ కుమార్  బుధవారం తెల్లవారుజామున తుపాకీతో కాల్చడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. భార్యను హత్య చేసిన అనంతరం నిందితుడు పరారయ్యాడు. 

గురువారం ఉదయం మౌలాఅలీ రైల్వే స్టేషన్  సమీపంలో అరుణ్ కుమార్‌‌తో పాటు అతనికి సహకరించిన మిర్  ముజమ్మిల్  అలీ ఖాన్‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నిందితుడైన హరీందర్ సింగ్  అలియాస్  హర్భజన్ సింగ్  పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.