భర్త మరణాన్ని తట్టుకోలేక.. చితిపై పడుకొని విలపిస్తూ..

భర్త మరణాన్ని తట్టుకోలేక.. చితిపై పడుకొని విలపిస్తూ..

చావైనా బ్రతుకైనా నీతోనే ...నువ్వు లేని జీవితం నాకొద్దు నీతో పాటు నన్ను తీసుకుని వెళ్లు.. నన్ను ఆపకండి చనిపోనియండి అంటూ భర్త చితిపై భార్య పడుకుని రోధిస్తూ ఉన్న తీరు పలువురిని కలిచివేసింది. ఈ హృదయ విధారకరమైన ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా నీరం గ్రామంలో జరిగింది. 

 వివరాలలోకి వెళితే ..

బీజాపూర్ జిల్లా అరాన్ పూర్ లో  జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు ఐఈడీ బాంబ్ తో పేల్చారు. ఈ  ఘటనలో 10 మంది జవాన్లు, ఓ డ్రైవర్ మృతిచెందారు. ఈ మృతుల్లో బీజాపూర్ జిల్లా నీరం గ్రామానికి చెందిన జవాన్ లఖ్ము ఉన్నారు. అయితే దంతెవాడలో అధికారిక లాంఛనాలతో మృతులకు నివాళ్లు అర్పించిన సీఎం భూపేశ్ బఫేల్ వారి త్యాగాలు వృథా కానివ్వం అన్నారు. అనంతరం జవాన్ల మృతదేహాలను వారి వారి స్వగ్రామాలకు పంపించారు.  నీరం గ్రామానికి చేరుకున్న జవాన్ లఖ్ము మృతదేహాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అనంతరం లఖ్ము మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరుపుతున్నారు. భర్త అంతిమ యాత్రలో పాల్గొన్న భర్య తూలే మధామి భర్త నుండి దూరం అవ్వడాన్ని  జీర్ణించుకోలేక పోయింది. ఒక్కసారిగా అతని చితిపై పడుకుని తన భర్తతో పాటు తాను చనిపోతానని..ఇద్దరిని కలిపి దహనం చేయండని వేడుకుంది.  భర్త చితిపై భార్య పడుకుని ఏడుస్తున్న తీరు అక్కడ వారిని కంటతండి పెట్టించింది. కుటుంబసభ్యులు, బంధు మిత్రులు ఆమెను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా వినకపోవడంతో పిల్లల కోసం అయినా జీవించాలని కోరడంతో ఆమె శాంతించారు. జవాన్ లఖ్ముకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. బీజాపూర్‌ జిల్లా నీరం గ్రామానికి చెందిన లఖ్ము అనే వ్యక్తి 2016లో డీఆర్‌జీ పోలీస్ ఉద్యోగాన్ని పొందారు. 

గ్రామస్తుల కన్నీటి వీడ్కోలు..

వందలాది గ్రామస్తులు సైనికుడు లఖ్ము మార్కం నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. అతని అంతిమయాత్రలో పాల్గొన్న స్థానికులు  షహీద్ జవాన్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అతని  త్యాగం  గ్రామం మొత్తాన్ని గర్వించేలా చేసింది. గ్రామస్తులు, బంధువులు అతనికి కన్నీటి కళ్లతో వీడ్కోలు పలికారు. గ్రామస్థుడు చేత్రం అటామి ఈ సంఘటనపై సంతాపం వ్యక్తం చేశాడు.