23న నడ్డాతో బీజేపీ నేతల వర్చువల్ మీటింగ్

23న నడ్డాతో బీజేపీ నేతల వర్చువల్ మీటింగ్

రాష్ట్రంలో పార్టీని పార్టీ బలోపేతం చేయడంపై సీరియస్‌‌గా దృష్టిసారించిన బీజేపీ అందుకు అనుగుణంగా ఒక్కో స్టెప్‌‌ వేస్తోంది. ఈ నెల 23న పార్టీ నేషనల్ చీఫ్ జగత్ ప్రకాష్ నడ్డా రాష్ట్ర బీజేపీ కొత్త కమిటీతో వర్చువల్‌‌ మీటింగ్‌‌ నిర్వహించనున్నారు . రాష్ట్రకమిటీ కోరిక మేరకు నడ్డా ఈ మీటింగ్‌‌కు అంగీకరించి , తేదీ ఖారారు చేసినట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌‌ చెప్పారు. టీఆర్ఎస్ సర్కార్ ఫెయిల్యూ ర్లను ఎప్పటికప్పుడు ఎండగడుతూ, ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఈ మీటింగ్‌‌లో రాష్ట్ర పార్టీ నేతలతో చర్చించను న్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కొత్త టీమ్‌తో పాటు రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు, అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఇన్‌‌చార్జర్లు ‌ ఈ మీటింగ్‌‌లో పాల్గొననున్నారు.

రాష్ట్రంలో టీఆర్ఎస్‌‌కు ఆల్డర్నేటివ్‌గా బీజేపీని తయారు చేయాలనే కేంద్ర కమిటీ ఆలోచన కు అనుగుణంగా రాష్ట్ర పార్టీకి పార్టీ కొత్త టీమ్‌‌ను వేశారు. నడ్డాతో మీటింగ్‌‌వారిలో కొత్త జోష్ నింపనుంది. టీఆర్ఎస్ సర్కార్‌‌పై పోరాటంలో అనుసరించాల్సిన వ్యూహంపై నడ్డా రాష్ట్ర నేతలతో చర్చించనున్నారు . రాష్ట్రంలో త్వరలో జీ హెచ్ఎంసీ, ఆ వెంటనే హైదరాబాద్, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇదే టైమ్‌లో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి బై ఎలక్షన్లు జరగనున్నాయి. వీటిపై కూడా మీటింగ్‌‌లో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కరోనాకట్టడిలో రాష్ట్ర సర్కార్ పూర్తిగా ఫెయిల్‌‌ అవడం, కేంద్రం రాష్ట్రా నికి ఏడు వేల కోట్లకు పైగా ఫండ్స్‌‌ఇచ్చినప్పటికీ వాటిని ఖర్చు చేయ కపోవడంపై కూడా చర్చించనున్నట్లు తెలిసింది. కృష్ణా , గోదావరి నదులపై కడుతున్న ప్రాజెక్టుల్లో జరుగుతున్నఅవినీతి, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన భారీ అవినీతి, పోతిరెడ్డిపాడు విషయంలో ఏపీ సర్కార్‌‌ కు అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరుపై ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలో నడ్డా దిశానిర్దేశం చేయను న్నారని పార్టీ నేతలు పార్టీ చెప్తున్నారు .

సెక్రటేరియట్ లో సీఎం ఫ్లోర్ బుల్లెట్ ఫ్రూఫ్