ముషీరాబాద్, వెలుగు: నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న యువత ఆందోళనకు మద్దతుగా తెలంగాణ ఉమెన్స్ అండ్ ట్రాన్స్‌జెండర్స్ ఆర్గనైజేషన్ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో మహిళలు, ట్రాన్స్‌జెండర్లు నిరసన చేపట్టారు. ఎన్‌టీఏను రద్దు చేసి, బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
పేపర్ లీకేజీల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని కోరారు. శాంతియుత నిరసనలపై ఆంక్షలు విధించవద్దని, ఢిల్లీలో ఆందోళనల్లో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు.
