కపిల్‌‌‌‌‌‌‌‌కు బ్రాంజ్‌‌‌‌‌‌‌‌

కపిల్‌‌‌‌‌‌‌‌కు బ్రాంజ్‌‌‌‌‌‌‌‌

గ్రేటర్‌‌‌‌‌‌‌‌ నోయిడా : ఇండియా వెయిట్‌‌‌‌‌‌‌‌ లిఫ్టర్‌‌‌‌‌‌‌‌ కపిల్‌‌‌‌‌‌‌‌ సోనో వాల్‌‌‌‌‌‌‌‌.. ఆసియా యూత్‌‌‌‌‌‌‌‌, జూనియర్‌‌‌‌‌‌‌‌ వెయిట్‌‌‌‌‌‌‌‌ లిఫ్టింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో రెండు బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ మెడల్స్‌‌‌‌‌‌‌‌ గెలిచాడు. గురువారం జరిగిన 102 కేజీల యూత్‌‌‌‌‌‌‌‌ కేటగిరీలో16 ఏళ్ల కపిల్‌‌‌‌‌‌‌‌ మొత్తం 276 (స్నాచ్‌‌‌‌‌‌‌‌125+ క్లీన్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ జర్క్‌‌‌‌‌‌‌‌151) కేజీల బరువు ఎత్తి మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌తో కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు. అలాగే స్నాచ్‌‌‌‌‌‌‌‌లో 125 కేజీల బరువుకు కూడా బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌ దక్కింది.

క్లీన్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ జర్క్‌‌‌‌‌‌‌‌లో చివరి ప్రయత్నంలో 157 కేజీల బరువు ఎత్తినా హెడ్‌‌‌‌‌‌‌‌ పొజిషన్‌‌‌‌‌‌‌‌లో నిర్ణీత టైమ్‌‌‌‌‌‌‌‌ వరకు బార్‌‌‌‌‌‌‌‌బెల్‌‌‌‌‌‌‌‌ను నిలుపలేకపోయాడు. దీంతో తృటిలో మరో మెడల్‌‌‌‌‌‌‌‌ మిస్సయ్యింది. విమెన్స్‌‌‌‌‌‌‌‌ 81 కేజీల్లో అంజనా శ్రీజిత్‌‌‌‌‌‌‌‌ బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌ను గెలుచుకుంది. క్లీన్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ జర్క్‌‌‌‌‌‌‌‌ విభాగంలో అంజన 108 కేజీల బరువు ఎత్తింది. ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా 190 కేజీల బరువు లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ చేసి నాలుగో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచింది.