దివ్యాన్షుకు వరల్డ్‌‌ రికార్డు గోల్డ్‌‌

దివ్యాన్షుకు వరల్డ్‌‌ రికార్డు గోల్డ్‌‌

కైరో: ఇండియా ఒలింపియన్‌‌ దివ్యాన్షు సింగ్‌‌ పన్వర్‌‌.. ఐఎస్‌‌ఎస్‌‌ఎఫ్‌‌ వరల్డ్‌‌ కప్‌‌లో వరల్డ్‌‌ రికార్డు బద్దలుకొట్టి గోల్డ్‌‌ మెడల్‌‌ను సాధించాడు. ఆదివారం జరిగిన మెన్స్‌‌ 10 మీటర్ల ఎయిర్‌‌ రైఫిల్‌‌ ఈవెంట్‌‌లో 21  ఏళ్ల దివ్యాన్షు 253.7 పాయింట్లతో టాప్‌‌ ప్లేస్‌‌లో నిలిచాడు.

దీంతో గతేడాది ఆసియా గేమ్స్‌‌లో షెంగ్‌‌ లీహావో (చైనా, 253.3) నెలకొల్పిన వరల్డ్‌‌ రికార్డును బ్రేక్‌‌ చేశాడు. క్వాలిఫికేషన్‌‌లోనూ ఇండియన్‌‌ షూటర్‌‌ 632.4 పాయింట్లు నెగ్గాడు. డానిల్‌‌ సోలాజో (ఇటలీ)కు సిల్వర్‌‌, లాజర్‌‌ కోవాసెవిక్‌‌ (సెర్బియన్‌‌)కు బ్రాంజ్‌‌ లభించాయి. ఓవరాల్‌‌గా వరల్డ్‌‌ కప్‌‌లో దివ్యాన్షుకు ఇది ఐదో గోల్డ్‌‌.