Yatra 2 Movie : యాత్ర 2 స్టార్స్ రెమ్యునరేషన్స్..ఏ రేంజ్లో తెలుసా?

Yatra 2 Movie : యాత్ర 2 స్టార్స్ రెమ్యునరేషన్స్..ఏ రేంజ్లో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాజకీయ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మూవీ యాత్ర. మహి వి రాఘవ్ తెరెకక్కించిన ఈ సినిమా 2019లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. దానికి సీక్వెల్గా యాత్ర 2 (Yatra 2) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వైఎస్ మరణాంతరం ఆయన కుమారుడు జగన్మోహన్‌ రెడ్డి పొలిటికల్ జర్నీ, చేసిన పాదయాత్ర నేపథ్యంలో యాత్ర 2 మూవీ ఉండబోతుంది. ఈ సినిమా రేపు (ఫిబ్రవరి 8న) థియేటర్లోకి రాబోతుంది.

భారీ అంచనాలతో రాబోతున్న ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ ఎంత? ఇందులో నటించిన నటి నటుల రెమ్యునరేషన్ ఎంత అనేది ఒక లుక్కేద్దాం. యాత్ర 2 మూవీ కోసం నిర్మాత శివ మేక ఏకంగా రూ.50 కోట్లు ఖర్చు చేసారంట. యాత్ర 2 సినిమాకు ప్రొడక్షన్ పరంగా బడ్జెట్ తక్కువే అయిన..నటీనటుల రెమ్యునరేషన్ల పరంగా ఎక్కువ మొత్తం ఖర్చు అయినట్లు సమాచారం.

ఈ సినిమాలో వై ఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ హీరో జీవా నటించారు.జీవాకి ఏకంగా రూ.8 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారంట. అలాగే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాత్రలో నటించిన మమ్ముట్టికి 3 కోట్ల వరకు చెల్లించినట్లు తెలుస్తోంది.

ఇక టెక్నీషియన్స్ పరంగా చూసుకుంటే..డైరెక్టర్ మహి వి రాఘవ్, మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్, సినిమాటోగ్రాఫర్ కలిసి పది కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇలా యాత్ర 2 మూవీకి రెమ్యునరేషన్ ల రూపంలోనే దాదాపు రూ.25 కోట్ల వరకు మొత్తం ఖర్చయ్యిందని  సమాచారం.ఇక మిగిలిన బడ్జెట్ ని మిగతా నటి నటులకు..సినిమా నిర్మాణానికి వెచ్చించునట్లు టాక్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ బట్టి..డైరెక్టర్ మహి వి రాఘవ్ మేకింగ్ స్టైల్ ఏ విధంగా ఉండనుందో అర్ధమవుతుంది. 

Also Read:నేటితో ముగియనున్న HMDA మాజీ డెరైక్టర్ శివబాలకృష్ణ కస్టడీ