రమణీయం.. ఎల్లమ్మ రథోత్సవం... బల్కంపేట ఆలయానికి పోటెత్తిన భక్తులు

రమణీయం.. ఎల్లమ్మ రథోత్సవం... బల్కంపేట ఆలయానికి పోటెత్తిన భక్తులు

పద్మారావు నగర్, వెలుగు: బల్కంపేట శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానంలో వార్షిక ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం అమ్మవారి రథోత్సవం కనులపండువగా నిర్వహించారు.

విద్యుత్ దీపాలు, రంగురంగుల పుష్పాలతో అలంకరించిన రథంపై సాయంత్రం ఎల్లమ్మ తల్లి ఉత్సవమూర్తిని అధిష్టింపజేసి ఆలయ వీధుల్లో ఊరేగించారు. నగరంలోని వివిధ ప్రాంతాలతోపాటు సరిహద్దు జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. 

డప్పు వాయిద్యాలు, వివిధ వేషధారణలు, కోలాటాలు, పోతురాజుల వీరంగం, శివసత్తుల పూనకాల మధ్య రథయాత్ర కోలాహలంగా సాగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. భద్రత నిమిత్తం జూబ్లీహిల్స్, బంజాహిల్స్, ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్ నగర్ పోలీసుల ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నిర్వహించారు.