యోగి మళ్లీ వస్తున్నాడు

యోగి మళ్లీ వస్తున్నాడు

టాలీవుడ్‌‌లో ప్రస్తుతం రీ రిలీజ్‌‌ల ట్రెండ్ నడుస్తోంది.  స్టార్ హీరోలు నటించిన గత చిత్రాలు మళ్లీ ఇప్పుడు థియేటర్స్‌‌లో విడుదల చేసి ఫ్యాన్స్‌‌లో జోష్‌‌ని నింపుతున్నారు మేకర్స్. ఇప్పటికే ప్రభాస్ నటించిన వర్షం, బిల్లా చిత్రాలు 4కె వెర్షన్‌‌లో రీ రిలీజ్ అయ్యా యి. తాజాగా వి.వి.వినాయక్ డైరెక్షన్‌‌లో 16 ఏళ్ల  క్రితం వచ్చిన  ‘యోగి’ చిత్రం ఈ నెల 18న 4కె వెర్షన్‌‌లో రీ రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో ప్రభాస్‌‌కి జంటగా నయనతార నటించగా, శారద,  కోట శ్రీనివాస రావు, ప్రదీప్ రావత్, సుబ్బరాజు, అలీ ఇతర  ముఖ్య పాత్రలు పోషించారు. 

అప్పట్లో మిక్సిడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఈసారి ఎలాంటి వసూళ్లు రాబడుతుందో అనే ఆసక్తి నెలకొంది. మరోవైపు ప్రభాస్ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌‌లో రూపొందిన ‘సాలార్’ పార్ట్ 1 వచ్చే నెల 28న వరల్డ్ వైడ్‌‌గా విడుదలవుతోంది. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 2898 ఎడి’, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌‌లో ‘స్పిరిట్’, మారుతి తీస్తున్న ఓ సోషియో ఫాంటసీ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌లో నటిస్తున్నాడు ప్రభాస్.