రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. వీకెండ్ పార్టీ కోసం ఫామ్‌హౌస్‌కు వచ్చిన ఓ యువకుడు.. స్విమ్మింగ్ పూల్‌లో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. స్నేహితులతో కలిసి సరదాగా గడుపుదామని వచ్చిన ఆ యువకుడి జీవితం.. ఇలా అర్థాంతరంగా ముగిసిపోయింది.
అయితే.. ఈ ఘటన తర్వాత తల్లిదండ్రులు ఘటన స్థలానికి చేరుకోక ముందే.. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించడం తీవ్ర వివాదాస్పదంగా మారింది.
మా బిడ్డ ఎలా చనిపోయాడో మాకు తెలియదు.. కనీసం కడసారి చూపు చూసుకోకుండా, మేము రాకముందే బాడీని ఆస్పత్రికి ఎలా తరలిస్తారు?" అంటూ మృతుడి తల్లిదండ్రులు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది? ఇది ప్రమాదమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
