యువ అడ్వకేట్స్..స్కిల్స్ పెంచుకోవాలి.. వాదించడం, డ్రాఫ్టింగ్ చేయడం నేర్చుకోవాలి

యువ అడ్వకేట్స్..స్కిల్స్ పెంచుకోవాలి.. వాదించడం, డ్రాఫ్టింగ్ చేయడం నేర్చుకోవాలి
  • హైకోర్టు జడ్జి జస్టిస్ సూరపల్లి నంద 

ముషీరాబాద్, వెలుగు: యువ న్యాయవాదులు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరపల్లి నంద సూచించారు. కొత్తగా న్యాయవృత్తిలో అడుగుపెట్టిన న్యాయవాదులు సమర్థవంతంగా వాదించడం, డ్రాఫ్టింగ్ చేయడం నేర్చుకోవాలన్నారు. బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పీఆర్ ఫౌండేషన్ ఫర్ సొసైటీ బిల్డ్​నెస్ అండ్ ఎంపవర్​మెంట్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఫ్రీ వర్క్​షాప్ నిర్వహిస్తున్నారు. హైకోర్టు అడ్వకేట్ పోనంపల్లి రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గురువారం జస్టిస్ నంద మాట్లాడుతూ.. న్యాయవృత్తిలో రాణించాలంటే యువ న్యాయవాదులకు వాదన పటిమతో పాటు డ్రాఫ్టింగ్ స్కిల్స్ అత్యంత అవసరమన్నారు. ప్రాక్టీస్ విధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవడం ద్వారానే వృత్తిలో గుర్తింపు లభిస్తుందని సూచించారు. న్యాయవాదులు రఘునాథ్, జె. ప్రభాకర్‌తో పాటు సుమారు 165 మంది యువ న్యాయవాదులు పాల్గొన్నారు.