లేబర్ నుంచి యూట్యూబర్ దాకా
ఇజాక్ ముండా.. ఒడిశాలోని సాంబల్‌పూర్ జిల్లాలో ఉన్న బాబుపలి ఊరికి చెందిన గిరిజన యువకుడు. రోజూ కూలీ పనికి పోయొటోడు. లాక్డౌన్ టైంలో పని లేదు. అప్పుడే అతడికి యూట్యూబ్ వీడియోలు చేయాలనే ఐడియా వచ్చింది. ఫ్రెండ్ దగ్గర మూడు వేల రూపాయలు అప్పు తీసుకొని ఫోన్ కొన్నాడు. ప్లేట్ నిండా అన్నం పెట్టుకొని, ఉన్న కొంచెం కూరతోనే ప్లేట్ ఖాళీ చేశాడు. ఆ వీడియోని ఒక్కరోజులోనే వేల మంది చూశారు. ఆ ఒక్క వీడియోతో మనోడి దశ తిరిగింది. ఫుడ్ వీడియోలతో బిజీ అయిపోయాడు. తన పేరు మీద ‘ఇజాక్ ముండా ఈటింగ్’ యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేశాడు. ఇప్పుడు నెలకు లక్షల్లో సంపాదిస్తున్నాడు. ‘‘నేను సెవెన్త్ క్లాస్ వరకే చదివాను. మా కమ్యూనిటీ, కల్చర్, జీవన విధానాన్ని అందరికీ తెలియజేసేలా వీడియోలు చేయాలి అనుకున్నా. మేము ఎంత సింపుల్‌గా బతుకుతామో వీడియోల ద్వారా చెబుతున్నా” అంటాడు ఈ యూట్యూబర్.
యూట్యూబ్ ఛానెల్: Isak Munda Eating
జీవితాన్ని మార్చిన రొట్టెల వీడియో
హర్యానాలోని నౌరంగాబాద్కి చెందిన బబితా పర్మర్ ఇప్పుడు యూట్యూబ్ సెన్సేషన్. ఆమె భర్త సరదాగా తీసిన ఒక్క వీడియో వాళ్ల లైఫ్‌ని మార్చేసింది. రోజూ లెక్కనే ఆ రోజు కూడా ఇంట్లోవాళ్ల కోసం రొట్టెలు చేస్తోంది బబిత. భర్త రంజిత్ ఆమె రొట్టెలు చేస్తున్న వీడియో తీసి నెట్లో పోస్ట్ చేశాడు. రెండు రోజుల్లోనే ఆ వీడియోని పదిలక్షలమంది చూశారు. అప్పటి నుంచి వారానికి రెండు వీడియోలు పోస్ట్ చేసేవాళ్లు. యూట్యూబ్ వాళ్ల నుంచి నెల సంపాదనగా పదమూడు వేలు అందుకుంది బబిత. ఇంట్లో వైఫై ఏర్పాటు చేసుకొని సొంతంగా ‘బబితా రాజ్‌పుత్’ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసింది. ఆ ఛానెల్‌కి నాలుగున్నర లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. అలాగని బబిత కష్టమైన వంటకాలు చేయదు. ఆమె టీ పెడుతున్న వీడియోని కూడా వేలల్లో చూశారంటే ఆమెకున్న క్రేజ్అర్థమవుతుంది. ఇప్పుడు వంటల యూట్యూబ్ వీడియోలతో బబితా నెలకి డెబ్భై వేల దాకా సంపాదిస్తోంది.
యూట్యూబ్ ఛానెల్: Babita Rajput