PVR INOX: PVR ఐనాక్స్ షాకింగ్ డెసిషన్.. థియేటర్స్లో ఇకనుండి అవి కనిపించవట!

PVR INOX: PVR ఐనాక్స్ షాకింగ్ డెసిషన్.. థియేటర్స్లో ఇకనుండి అవి కనిపించవట!

సినిమా లవర్స్ లో మల్టీప్లెక్స్ అంటే టక్కున గుర్తొచ్చేది పీవీఆర్‌ ఐనాక్స్‌(PVR INOX). కొత్త సినిమాలను ఈ థియేటర్స్ లో చూసేందుకు ఆడియన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. కారణం ఆ థియేటర్స్ లో ఉండే క్వాలిటీ.వీరికి దేశ వ్యాప్తంగా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఇక థియేటర్స్, సినిమాస్ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త డెసిషన్స్ తీసుకుంటూ వార్తల్లో నిలిచే పీవీఆర్‌ ఐనాక్స్‌.. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. 

కారణం ఏంటంటే.. తాజాగా పీవీఆర్‌ ఐనాక్స్‌ సంస్థ మరో ఇంటరెస్టింగ్ డెసిషల్ తీసుకుంది. అదేంటంటే.. సినిమా మొదలయ్యే ముందు వచ్చే యాడ్స్ సమయాన్ని తగ్గించనుంది. ఇంతకుముందు 35 నిమిషాలు ఉండే ఈ సమయాన్ని 10 నిమిషాలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ పదినిమిషాల్లో కూడా త్వరలో రాబోతున్న సినిమాల ట్రైలర్స్ తో పాటుగా కొన్ని యాడ్స్ ను ప్లే చేస్తారట. దీంతో ఆడియన్స్ కు సినిమాలు చేసేముందు యాడ్స్ చూసే తలనొప్పి తగ్గనుంది.

ఇదే విషయంపై పీవీఆర్‌ ఐనాక్స్‌ సంస్థ ది లగ్జరీ కలెక్షన్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ చీఫ్‌ రెనాడ్‌ పలియెర్‌ స్పదించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ.. యాడ్స్‌ సమయాన్ని తగ్గించడం వల్ల సినిమా షోల సంఖ్య పెంచుకునే అవకాశం ఉంది. యాడ్స్‌ తొలగించడం వల్ల సంస్థకు నష్టం వస్తుంది. కానీ, అదనపు షోల వల్ల వచ్చే ఆదాయంతో ఆ నష్టాన్ని పూడ్చుకోవచ్చు. ఇకపై కేవలం పది నిమిషాలు మాత్రమే యాడ్స్‌ ప్లే అవుతాయి. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో ఈ యాడ్‌ ఫ్రీ అమల్లో ఉంది. త్వరలోనే మరికొన్ని చోట్ల అమలుచేయడానికి ప్లాన్ చేస్తున్నాం.. అంటూ చెప్పుకొచ్చారు రెనాడ్‌ పలియెర్‌. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.