
ప్రముఖ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash kumar), ఐశ్వర్య రాజేష్(Aishwarya rajesh) జంటగా వచ్చిన లేటెస్ట్ మూవీ డియర్(Dear). దర్శకుడు ఆనంద్ రవిచంద్రన్(Anand Ravichandran) తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గురక సమస్య ప్రధానంగా వచ్చిన ఈ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. తీసుకున్న పాయింట్ బాగానే ఉన్నా.. ప్రెజెంట్ చేసిన విధానం అంతంగా ఆకట్టుకోకపోవడంతో ఆడియన్స్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు.
దీంతో డియర్ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదికూడా థియేటర్స్ లో విడుదలైన రెండువారాల్లోనే. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 28 నుండి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరి థియేటర్స్ లో ప్లాప్ గా నిలిచిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.
ఇక డియర్ సినిమా కథ విషయానికి వస్తే.. అర్జున్ (జీవీ ప్రకాశ్) న్యూస్ రీడర్ అవ్వాలనుకుంటాడు. కానీ, అతనికి చిన్న శబ్దాలకు కూడా నిద్రలో నుంచి లేచే సమస్య ఉంటుంది. మరోవైపు దీపిక (ఐశ్వర్యా రాజేశ్) గురక సమస్యతో బాధపడుతుంది. ఒకరికి ఉన్న సమస్యలు ఒకరికి తెలియక వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఆ సమస్యల వల్ల వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు అనేది డియర్ సినిమా కథ.