హరీశ్ సవాల్ ను స్వీకరిస్తున్నా..పంద్రాగస్టులోపు రుణమాఫీ చేసి తీరుతా: సీఎం రేవంత్

హరీశ్ సవాల్ ను స్వీకరిస్తున్నా..పంద్రాగస్టులోపు రుణమాఫీ చేసి తీరుతా: సీఎం రేవంత్

ఆగస్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ తో భేటీ అయిన రేవంత్.. తాను హరీశ్ రావు సవాల్ ను స్వీకరిస్తున్నానని చెప్పారు. పంద్రాగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతాం..హరీశ్ రావు  రాజీనామా లేఖను రెడీగా పెట్టుకోవాలని సూచించారు. రైతులకు రుణమాఫీ చేయకపోతే తమ ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. హరీశ్ రావుకు సిగ్గుండాలి.. రాజీనామా ఫార్మాట్ తెల్వదా? రాజీనామా లేఖలో సీస పద్యం రాసుకొచ్చారని సెటైర్ వేశారు. ఇపుడే ఎందుకు అమరవీరుల స్థూపం దగ్గరకు వెళ్లారని ప్రశ్నించారు.

 సెమీఫైనల్లో కేసీఆర్ ను ఓడించాం..ఇపుడు బీజేపీతో ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నాం.. ఖచ్చితంగా ఫైనల్లో గెలిచి తీరాలన్నారు రేవంత్. తెలంగాణలో 14 సీట్లు గెలవాల్సిందేనని చెప్పారు. లెక్క పక్కా 14 సీట్లు పక్కా అని అన్నారు రేవంత్ . 

ALSO READ | రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత

పండుగలు వస్తే  బీజేపీ సమస్యలు సృష్టిస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  బీజేపీ ఎన్నికల కోసమే దేవుడితో రాజకీయం చేస్తుందని ఆరోపించారు. శ్రీరాముడి పేరుతో రాజకీయం చేస్తుందని... దేవుడు గుడిలో ఉండాలి..భక్తి గుండెల్లో ఉండాలన్నారు. మోదీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని చెప్పారు. రిజర్వేషన్లు రద్దు చేసి ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ కు అమ్మేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని మండిపడ్డారు. బీజేపీ భావజాలం ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిందన్నారు.   రిజర్వేషన్లు రద్దు చేయాలన్నదే వారి భావజాలమన్నారు. బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ అని ధ్వజమెత్తారు రేవంత్. 

తెలంగాణలో కాంగ్రెస్  పవర్లోకి వచ్చేందుకు సోషల్ మీడియా ఉపయోగపడిందన్నారు రేవంత్.   రాజ్యాంగ హక్కులను బీజేపీ కాలరాస్తోందని..   తప్పులను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో  తిప్పికొట్టాలని సూచించారు.   తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్ర జరుగుతోందన్నారు.  దేశం 166 లక్షల కోట్ల అప్పుల్లో ఉంటే.. అందులో మోదీ చేసిందే 113 లక్షల కోట్లని చెప్పారు రేవంత్.  అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందో మోదీ చెప్పాలని ప్రశ్నించారు.