బీఆర్ఎస్ లో హరీశ్ ఉద్యోగి మాత్రమే.. ఆయన మాటలు చెల్లవు : మంత్రి కొమటిరెడ్డి

 బీఆర్ఎస్ లో హరీశ్ ఉద్యోగి మాత్రమే.. ఆయన మాటలు చెల్లవు : మంత్రి కొమటిరెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పై ఫైర్ అయ్యారు మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి. హరీశ్ రావు బీఆర్ఎస్ లో ఉద్యోగి మాత్రమే అని విమర్శించారు. రాజీనామా లేఖతో మరో డ్రామా మొదలు పెట్టారని ఫైర్ అయ్యారు. రాజీనామా లేఖ ఎలా ఉంటుందో హరీశ్ కు తెలియదా అని ప్రశ్నించారు. హరీశ్ మాటలు జనం నమ్మడం లేదని బీఆర్ఎస్ హయాంలోనే హరీశ్ మాటలు చెల్లలేదని విమర్శించారు. 

మంత్రి కోమటిరెడ్డి శుక్రవారం రోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణమాఫీ చేస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని చెప్పారు. యూపీఏ హయాంలో దేశ వ్యాప్తంగా రుణమాఫీ అయ్యిందని తెలిపారు. పేదలకు ఉపయోగపడాలని ఉపాధి హామీ పథకం తెచ్చారని చెప్పారు. చెప్పిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని అన్నారు.  ఆ విషయం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారని తెలిపారు.

 బీఆుర్ఎస్ హయాంలో హోందమత్రినే సెక్రటేరియట్ లోకి రానివ్వలేదని ఆరోపించారు హరీశ్ కు దమ్ముంటే మెదక్ లో డిపాజిట్ తెచ్చుకోవాలని సూచించారు. కామెన్ సెన్స్ లేకుండా 10 ఏండ్లు పాలించారని విమర్శించారు. కేసీఆర్ ది నోరా మోరా మానసికంగా ఇబ్బందికి గురయ్యి మాట్లాడుతున్నారని విమర్శించారు. దళితులను కేసీఆర్ మోసం చేశారని కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు.