అన్నీ వీవీప్యాట్లు క్రాస్ వెరిఫికేషన్ కుదరదు: సుప్రీం కోర్టు

అన్నీ వీవీప్యాట్లు క్రాస్ వెరిఫికేషన్ కుదరదు: సుప్రీం కోర్టు

వీవీప్యాట్లు అన్నీ ఈవీఎంలతో క్రాస్ వెరిఫికేషన్ చేయడం కుదరదని శుక్రవారం సుప్రీం కోర్టు చెప్పింది. కేరళలో కాసర్ ఘడ్ నియోజకవర్గంలో నిర్వహించిన మాక్ పోలింగ్ లో నాలుగు ఈవీఎం మెషిన్లు తప్పుగా పనిచేస్తున్నాయని కొందరు నాయకులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈవీఎంలో వేసిన ఓట్ల కంటే వీవీప్యాట్లో సంఖ్య ఎక్కువగా చూపిస్తున్నాయి. ఈవీఎంలో పోలైన ఓట్లను వీవీప్యాట్లతో క్రాస్ వెరిఫై చేయించాలని ఎన్నికల కమిషన్ ను ఆదేశించాలని సుప్రీం కోర్టును కోరారు. 

ఎన్నికల్లో ఉపయోగించిన అన్నీ ఈవీఎం మెషిన్లతో వీవీప్యాట్లలో పోలైన ఓట్లను పోల్చి చూడాలని కోర్టును కొన్ని సంఘాలు కోరాయి. ఎలక్షన్ కమిషన్, పిటిషినర్ తరుపు వాదనలు విన్న సుప్రీం కోర్టు 100శాతం వీవీప్యాట్లను క్యాస్ చెక్ చేయడం కుదరదని ఏప్రిల్ 26న తీర్పు చెప్పింది.