కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మొదటి నుంచీ శని.. ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా వ్యతిరేకిస్తుంది: కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మొదటి నుంచీ శని.. ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా వ్యతిరేకిస్తుంది: కేసీఆర్

తెలంగాణలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా కేంద్ర బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని విమర్శించారు కేసీఆర్. ఆదివారం (డిసెంబర్ 21) బీఆర్ఎస్ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో బీజేపీపై విమర్శలు గుప్పించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు మొదటి నుంచి శని.. ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా వ్యతిరేకిస్తుందని అన్నారు. 

చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో చేరడం.. ఆయన మాటలు పట్టుకొని తెలంగాణలో అభివృద్ధి పథకాలను వ్యతిరేకించడమే బీజేపీ పని అయ్యిందంటూ మండిపడ్డారు. తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడతామని అన్నారు. తెలంగాణ విషయంలో కేంద్రం అవలంభిస్తున్న విశానాలను ఎండగడతామని అన్నారు. 

రాజకీయాల్లో గెలుపోటములు సహజం.. కానీ ఎంత తెలివితక్కువ దద్దమ్మ ప్రభుత్వం వచ్చినా రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చాక పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక్క తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు.. అంటూ ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్.