కాసులు కురిపించని ఫుడ్‌ డెలివరీ బిజినెస్‌

కాసులు కురిపించని ఫుడ్‌ డెలివరీ బిజినెస్‌

మూడు రెట్లు పెరిగిన ఆదాయం.. ఐదు రెట్లు పెరిగిన ఖర్చులు
జొమాటోకు గత ఏడాది రూ.2 వేల కోట్ల నష్టాలు
మిగతా కంపెనీలదీ అదే తీరు

ఇండియాలోని దాదాపు అన్ని నగరాల్లో జొమాటో,స్విగ్గీ, ఉబర్‌‌ ఈట్స్ వంటి ఫుడ్‌ స్టార్టప్‌‌ల డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు వినియోగదారులకు పార్సిల్స్‌‌ అందిస్తూ బిజీగా కనిపిస్తారు. వీరి వ్యాపారం వేగంగా ఎదుగుతున్న మాట నిజమే అయినా, ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే! ఆర్డర్లు పెరుగుతున్నా వీటి ఆదాయాలు పెరగడం లేదు. ఫుడ్ స్టార్టప్‌‌లు, యూనికార్న్‌‌ల వ్యాపారం ఏటా పెరుగుతూనే ఉండడటంతో వీటిలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు తరచూ నిధులు గుమ్మరిస్తున్నారు.లాభాలు మాత్రం ఎంతకూ కనిపించడం లేదు.ఈ విషయంలో కచ్చితమైన లెక్కలు అందుబాటులో లేకున్నా , తాజాగా విడుదలైన జొమాటో ఆర్థిక నివేదికను పరిశీలిస్తే ఈ వ్యాపారం ఎంత రిస్కో సులువుగా అర్థమవుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 10 వేల నగరాల్లోని 14లక్షల మందికి నిత్యం ఆర్డర్లు డెలివరీ చేస్తున్నది. గురుగ్రామ్‌ కేంద్రంగా పనిచేసే ఈ కంపెనీ 2019సంవత్సరానికి గానూ ఇటీవల వార్షిక నివేదికవిడుదల చేసింది.

డెలివరీ నష్టాలు తగ్గాయ్‌…
జొమాటో నివేదికలో వివరాల ప్రకారం.. ఈ కంపెనీ ప్రతి డెలివరీకి నష్టాన్ని గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం 43 శాతం తగ్గించుకుంది. గతమార్చిలో ఒక్కో డెలివరీకి రూ.44 నష్టపోయింది. ఇప్పుడు అది రూ.25లకు తగ్గింది. లాస్ట్‌ మైల్‌‌ డెలివరీ ఖర్చు రూ.86నుంచి రూ.65లకు తగ్గింది. తాముసాధించిన అతిపెద్ద విజయం ఇదేనని తెలిపింది. అంతేగాక ఒక్కో రైడ్‌ లో డెలివరీలసంఖ్య 0.9 నుంచి 1.4లకు పెరిగాయి. కొత్తప్రాంతాల్లో విస్తరణతోపాటు డెలివరీ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడమూ ముఖ్యమని జొమాటో వర్గాలు తెలిపాయి. పెద్ద నగరాల్లో అధికజనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో లాభాలు వస్తున్నాయని పేర్కొన్నా యి. గత ఏడాది జొమాటో ఫుడ్‌డెలివరీ వ్యాపారంపై 500 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.3,461 కోట్లు) మదుపు చేయగా206 మిలియన్ డాలర్ల ఆదాయం (దాదాపురూ.1,426 కోట్లు) మాత్రమే వచ్చింది. ఆదాయంపరంగా 2018 ఆర్థిక సంవత్సరంలో40 శాతం వృద్ధి కనిపించింది. 100 నగరాలకు విస్తరించాలన్న లక్ష్యాన్ని కూడా సాధించింది.ప్రస్తుతం కంపెనీ వార్షిక రన్‌‌ రేట్‌‌ 350 మిలియన్‌‌ డాలర్లుగా (దాదాపు రూ.2,423 కోట్లు) నమోదయింది.

ఇండియాలోనే నష్టా లు ఎక్కువ..

గత ఏడాదితో పోలిస్తే ఆదాయం మూడు రెట్లు పెరిగినా, వ్యయాలు ఐదు రెట్లు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇండియాలోనే నష్టాలు (దాదాపు రూ.2,030 కోట్లు) ఎక్కువగా ఉన్నాయని కంపెనీ తెలిపింది.ప్రచారానికి ప్రాధాన్యం ఇవ్వడం, కొత్త కస్టమర్ల కోసం డిస్కౌంట్లు ఇవ్వడం, ఇప్పటి వరకు ఎవరూ సేవలుఅందించని నగరాలకు విస్తరించడం వల్ల గణనీయమైన ప్రగతి సాధించామని కంపెనీ తెలిపింది. అయితే కమీషన్లు పెరిగినా ప్రకటనల ఆదాయాలు తగ్గుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. జొమాటో వాల్యుయేషన్‌‌ను 3.6 బిలియన్‌‌ డాలర్లుగా (దాదాపు రూ.24 వేల కోట్లు) లెక్కగట్టిన హెచ్‌‌ఎస్‌‌బీసీ ఆర్డర్లుపెరిగిన ఉద్యోగులకు చెల్లింపులు, డెలివరీ ఖర్చులు తగ్గుతాయని పేర్కొంది. 2024 నాటికి జొమాటో రోజుకు 30 కోట్ల డెలివరీలను సాధిసుందని విశ్లేషించింది. అయితే జొమాటో మాదిరే మిగతా కంపెనీలుకూడా కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడానికి, ఉన్న కస్టమర్లను కాపాడుకోవడానికి భారీగా డిస్కౌంట్లు ఇవ్వడం, విపరీతమైన పోటీ కారణంగా ఇప్పట్లో లాభాలబాట పట్టే అవకాశాలు లేవని ఈ రంగంలోనినిపుణులు చెబుతున్నా రు. ఈ నేపథ్యం లో ఉబర్‌‌ ఈట్స్ తన వ్యాపారాన్ని స్వి గ్గీకి అమ్మే ఆలోచనలో ఉన్నట్టుసంబంధిత వర్గా లు తెలిపాయి. ఈ దిశగా రెం డు కంపెనీల మధ్య చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.