జొమాటోకి రూ.28 కోట్లు

జొమాటోకి రూ.28 కోట్లు
  • గ్లేడ్ బ్రూక్ ప్రైవేట్ ఇన్వెస్టర్ల నుం చి రూ.28 కోట్లు
  • వంద కోట్ల డాలర్ల నిధుల సేకరణకు కసరత్తు

Zomoto gets Rs.28 crముంబై: ఆన్‌‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో 40 మిలియన్ డాలర్ల(రూ.28 కోట్లకు పైగా)
నిధులను సేకరించింది. అమెరికాకు చెందిన గ్లేడ్ బ్రూక్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ నుంచి ఈ నిధులను
పొందినట్టు రిజిస్ట్రార్ ఆఫ్​ కంపె నీస్(ఆర్‌‌‌‌ఓసీ) వద్ద జొమాటో డాక్యుమెంట్స్ నమోదు చేసింది. మొత్తం 100 కోట్ల డాలర్ల నిధులు సేకరించేందుకు జొమాటో తీవ్ర కసరత్తులు చేస్తోంది.

జొమాటో ప్రత్యర్థి స్విగ్గీ ఇటీవలే 100 కోట్ల డాలర్ల నిధులను నాస్పర్స్, ఇతర ఇన్వెస్టర్ల నుంచి సేకరించింది. స్విగ్గీకి పోటీగా జొమాటో కూడా నిధుల వేట బాట పట్టింది. ఫిబ్రవరి 5న గ్లేడ్ బ్రూక్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్‌‌తో కుదుర్చుకున్న డీల్‌‌పై సంతకాలు చేసినట్టు జొమాటో ప్రకటించింది. మిగతా మొత్తం కోసం చైనీస్ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం ప్రైమవీర క్యాపిటల్, యాంట్ ఫైనాన్సియల్, ఇతర ఇన్వెస్టర్లతో జొమాటో చర్చలు జరుపుతోంది.

జొమాటో అంతకముందు అలీబాబాకు చెందిన చెల్లింపుల అనుబంధ సంస్థ యాంట్ ఫైనాన్సియల్ నుంచి 21 కోట్ల డాలర్ల నిధులను సేకరించింది. స్విగ్గీ సేకరించిన 100 కోట్ల డాలర్ల నిధులు, ఇతర ప్లేయర్లు ఎవరూ మార్కెట్లోకి ఎక్కిరాకుండా అడ్డుకట్ట వేసేందుకు దోహదం చేయనున్నాయి. ప్రస్తుతం స్విగ్గీ ఆన్‌‌లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్‌‌లో టాప్ ప్లేస్‌లో ఉంది. జొమాటో సేకరిస్తున్న ఈ నిధులు, స్విగ్గీ వేసే ప్లాన్లకు బ్రేక్ ఇచ్చేందుకు సాయపడనున్నాయి.