భద్రాచలంలో ఎండు గంజాయి పట్టివేత

 భద్రాచలంలో ఎండు గంజాయి పట్టివేత

భద్రాచలం, వెలుగు: రెండు స్కూటీల ద్వారా అక్రమంగా తరలిస్తున్న గంజాయిని అబ్కారీ ఎన్​ఫోర్స్​మెంట్​ పోలీసులు ఆదివారం భద్రాచలంలో పట్టుకున్నారు. సీఐ శ్రీనివాస్​ ఆధ్వర్యంలో కూనవరం రోడ్డులోని రవాణా శాఖ​ఆఫీస్​ ఎదురుగా తనిఖీలు నిర్వహిస్తుండగా రెండు స్కూటీల్లో తరలిస్తున్న 5.36 కిలోల ఎండుగంజాయి దొరికింది. 

యాదాద్రి జిల్లా భువనగిరికి చెందిన ఉడుత నవీన్, ఇదే జిల్లాలోని కొండాపురం గ్రామానికి చెందిన పంజాల మణికంఠ ఒడిశా నుంచి యాదాద్రి భువనగిరికి గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. ఇదే ప్రాంతంలో మరో చోట అనుమానాస్పదంగా పార్కు చేసిన మరో స్కూటీలో 12.290 కిలోల ఎండు గంజాయి పట్టుబడింది. వీటి విలువ రూ.10.52 లక్షలు ఉంటుందని ఎన్​ఫోర్స్​మెంట్​ సీఐ శ్రీనివాస్​ తెలిపారు.