బెల్లంపల్లి రూరల్, వెలుగు: మంచిర్యాల జిల్లా నెన్నెల, కన్నెపల్లి మండలాలకు కొత్త తహసీల్దార్ బిల్డింగ్స్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.4.50 కోట్లుమంజూరు చేసినట్లు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. ఒక్కో మండలానికి రూ.2.25 కోట్ల చొప్పున కేటాయించినట్లు చెప్పారు. మంగళవారం రాష్ట్ర రెవెన్యూ , గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆయన వెంట డీసీసీ ఉపాధ్యక్షుడు బొమ్మెన హరీశ్‌గౌడ్, మార్కెట్‌కమిటీ మాజీ వైస్‌చైర్మన్ నర్సింగరావు ఉన్నారు.
