న్యూఇయర్ సందర్భంగా ప్రతి ఒక్కరు రూల్స్ పాటించాలని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి స్పష్టం చేశారు. దుర్గం చెరువు ఫ్లై ఓవర్ తప్ప అన్ని ఫై ఓవర్స్ మూసివేస్తామని చెప్పారు. మాదాపూర్ జోన్లో 60 స్పెషల్ ఈవెంట్స్కి పర్మిషన్ ఇచ్చామన్నారు. ఈవెంట్స్ ఆర్గనైజర్స్తో ఇప్పటికే మీటింగ్ కండెక్ట్ చేశామని.. ఈవెంట్స్లో డ్రగ్స్ దొరికితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈవెంట్స్కి వచ్చేవారు డ్రింక్ చేసి ఉంటే ఆర్గనైజర్స్ వారికి డ్రైవర్స్ని ప్రొవైడ్ చేయాలని సూచించారు. ఔట్ డోర్లో జరిగే ఈవెంట్స్ కి డీజే పర్మిషన్ లేదన్నారు.
ఫ్లై ఓవర్లు బంద్...
సైబరాబాద్ పరిధిలో ఉన్న అన్ని ఫ్లై ఓవర్లను రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు క్లోజ్చేయనున్నారు. శిల్పా లేఅవుట్ ఫ్లై ఓవర్, గచ్చిబౌలి ఫ్లై ఓవర్, బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ 1,2, షేక్‌పేట, మైండ్‌స్పేస్, రోడ్ నెం.45 ఫ్లై ఓవర్, సైబర్ టవర్స్ ఫ్లై ఓవర్, జేఎన్టీయూ ఫ్లై ఓవర్, కైత్లాపూర్ ఫ్లైఓవర్, బాబు జగ్జీవన్ రాం ఫ్లైఓవర్(బాలానగర్)ను క్లోజ్ చేయనున్నారు. ఈ రూట్లలో ట్రావెల్ చేసే వెహికల్స్‌ను, వాకర్స్ ను ఫ్లై ఓవర్ల పైకి అనుమతించరు.

