కొలంబో: ఆల్‌రౌండ్ షోతో చెలరేగిన ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్‌లో బోణీ చేసింది. బ్యాటింగ్‌లో జోస్ ఇంగ్లిస్ (37), మ్యాట్ రెన్‌షా (37), బౌలింగ్‌లో నాథన్ ఎలిస్ (4/12), ఆడమ్ జంపా (4/23) చెలరేగడంతో బుధవారం జరిగిన గ్రూప్–బి మ్యాచ్‌లో ఆసీస్ 67 రన్స్ తేడాతో ఐర్లాండ్‌పై గెలిచింది. టాస్ గెలిచిన ఆసీస్ 20 ఓవర్లలో 182/6 స్కోరు చేసింది. ట్రావిస్ హెడ్ (6), మ్యాక్స్‌వెల్ (9) నిరాశపర్చారు.
కూపర్ కనోలీ (11 నాటౌట్), బార్ట్‌లెట్ (11 నాటౌట్) మోస్తరుగా ఆడారు. మార్క్ అడెర్ 2 వికెట్లు తీశాడు. ఛేజింగ్‌లో ఐర్లాండ్ 16.5 ఓవర్లలో 115 రన్స్‌కే ఆలౌటైంది. జార్జ్ డాక్రిల్ (41) టాప్ స్కోరర్. లోర్కాన్ టకెర్ (24), రాస్ అడెర్ (12), మార్క్ అడెర్ (12), గారెత్ డిలానీ (11) ఫర్వాలేదనిపించినా మిగతా వారు ఫెయిలయ్యారు. ఇన్నింగ్స్‌లో ఆరుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో ఐర్లాండ్ కోలుకోలేకపోయింది. ఎలిస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
