కాక్రోచ్ జనతా పార్టీపై అప్పుడే ఇంత నిర్బంధమా..? బెంగళూరులో ఆంక్షలపై నెటిజన్లు ఫైర్

కాక్రోచ్ జనతా పార్టీపై అప్పుడే ఇంత నిర్బంధమా..? బెంగళూరులో ఆంక్షలపై నెటిజన్లు ఫైర్

ఇండియాలో అన్ని రాజకీయ పార్టీలకు కాక్రోచ్ జనతా పార్టీ పేరు వింటే ముచ్చెమటలు పడుతున్నాయి. తమ పీఠాలు ఎక్కడ కదిలిపోతాయోనన్న భయం, ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ విధానాలు, వ్యవస్థలో ఉన్న లోపాలను ప్రశ్నిస్తూ సెటైరికల్ గా మొదలుపెట్టిన పార్టీతో కొన్ని పార్టీల కూసాలు కదిలిపోయేలా కనిపిస్తున్నాయి. కేవలం నాలుగు రోజుల్లోనే బీజేపీ సోషల్ మీడియా ఫాలోవర్లను బీట్ చేసిందంటే ఎంత స్పీడుగా స్ప్రెడ్ అవుతుందో ఊహించవచ్చు. 

ఈ పార్టీ నిజమైన పార్టీగా అవతరిస్తే తమ కూసాలు ఎక్కడ కదిలిపోతాయోననే ఆందోళనతోనే కావచ్చు.. ఇండియాలో ఎక్స్ ఖాతాను బ్యాన్ చేశారు.. అని ఆ పార్టీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇండియన్ పాలిటిక్స్ లో ఇంత డిస్రప్షన్స్ క్రియేట్ చేస్తున్న పార్టీ అంటే దాదాపు అందరికీ తడిసిపోతుందనే చెప్పాలి. ఎలాంటి సంఘ విద్రోహ పనులు చేయకపోయినా.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకపోయినా.. బ్యాన్ విధించడం.. నిషేధాజ్ఞలకు దిగటం చూస్తుంటే ఫ్యూచర్ ఏంటో స్పష్టంగా అర్థమవుతోంది. 

లేటెస్టుగా.. బెంగళూరు పోలీసులు తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. కాక్రోచ్ పార్టీ అభిమానులు ఒక దగ్గర కూడటానికి ఇచ్చిన పిలుపుపై నిషేధం విధించారు. 2026 మే 24.. అంటే ఆదివారం.. బెంగళూరులోని టౌన్ హాల్ సమీపంలో గ్యాదర్ అయ్యి.. మానవ హారం ఏర్పాటు చేయాలని సీజేపీ పిలుపునిచ్చింది. 

దీనిపై ఆదిలోనే పోలీసులు ఆంక్షలు విధించడం చర్చనీయాంశం అయ్యింది. బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ అఫీషియల్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. మానవ హారానికి, గ్యాదరింగ్ కు ఎలాంటి అనుమతి లేదని సర్క్యులర్ జారీ చేశారు. 

బెంగళూరు టౌన్ హాల్ దగ్గర శాంతియుత మానవ హారాలు నిర్వహించాల్సిందిగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నప్పటికీ.. సిటీలో ధర్నాలకు, ఆందోళనలకు, ర్యాలీలకు పర్మిషన్ లేదని పోలీసులు చెబుతున్నారు. కర్ణాటక హైకోర్టు 2022ఆగస్టు 1న ఇచ్చిన ఆర్డర్ ప్రకారం.. కేవలం ఫ్రీడమ్ పార్క్ దగ్గరనే సమావేశం ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. 

తీవ్రంగా స్పందిస్తున్న నెటిజన్లు:

పోలీసుల ఆర్డర్ పై కాక్రోచ్ పార్టీ మద్ధతుదారులు తీవ్రంగా స్పందిస్తున్నారు. పోలీసుల తీరు హాస్యాస్పదంఅంటూ ఫైర్ అవుతున్నారు. తామేమైనా ధర్నాలకు, ఆందోళనలకు దిగుతామని చెప్పామా.. శాంతి యుత వాతావరణంలో మానవహారాలు నిర్మిస్తాం అని మాత్రమే కదా చెప్పింది.. అంటూ ప్రశ్నిస్తున్నారు. నేపాల్ లో ఇలాంటి నిర్బంధాల కారణంగానే జన్–జీ ఉద్యమం ఉప్పెనలా మారిందని చెబుతున్నారు. 

సెటైరికల్ గా మొదలై.. సీరియస్ డిబేట్..

'కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)' మహారాష్ట్రకు చెందిన అభిజీత్ దీప్కే అనే 30 ఏండ్ల యువకుడి ఆలోచన నుంచి మే 16న పుట్టింది. కానీ ఇది రాజకీయ పార్టీ కాదు. దేశంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ప్రభుత్వాన్ని నిలదీసే సోషల్ మీడియా పార్టీ. ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ఏర్పాటు చేసిన ఆ పార్టీకి జనం నుంచి అపూర్వ మద్దతు లభించింది. ఎంతలా అంటే జస్ట్ ఆరు రోజుల్లోనే రెండు కోట్ల మంది ఆ సెటైరికల్ పార్టీని ఫాలో అవడం మొదలుపెట్టారు. 

గంటగంటకూ ఫాలోవర్లు పెరుగుతూనే ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్యను సీజేపీ దాటేసింది. దేశంలోని పరిస్థితులపై జెనీ తీవ్ర అసహనం, అసంతృప్తితో ఉన్నదని ఈ పరిణామం రుజువు చేస్తోంది.