మరో 3 రోజులు తేలికపాటి వర్షాలు 

మరో 3 రోజులు తేలికపాటి వర్షాలు 

హైదరాబాద్: తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. క్రింది స్థాయి గాలులు పశ్చిమ దిశ / నైరుతి దిశ నుండి తెలంగాణా రాష్ట్రంలోకి  వస్తున్నాయని, వీటి ప్రభావంతో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ  మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఎల్లుండి చాలా ప్రదేశాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు మరియు మెరుపులుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది.