అధికారం మళ్లీ మాదే : మిజోరం సీఎం జోరంతంగా

అధికారం మళ్లీ మాదే : మిజోరం సీఎం జోరంతంగా

ఐజ్వాల్: మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్)​ఈసారి కూడా అధికారంలోకి వస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోరంతంగా తెలిపారు. గతంలో వచ్చిన సీట్ల కంటే ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఐజ్వాల్​ఈస్ట్​1 అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్​పత్రాలు దాఖలు చేసిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు. 

రాష్ట్రంలో తమ ప్రధాన ప్రత్యర్థి జోరామ్ పీపుల్స్ మూవ్‌‌‌‌మెంట్(జెడ్‌‌‌‌పీఎం) పార్టేనని తెలిపారు. గతంలో రాహుల్​ గాంధీ ఆరోపించినట్లుగా ఆర్ఎస్​ఎస్​తో తమకు ఎలాంటి సంబంధాలు లేవని తేల్చి చెప్పారు. ఎంఎన్‌‌‌‌ఎఫ్ కేంద్రంలోని ఎన్డీయేతో కలిసి వెళ్తుందన్నారు. 40 అసెంబ్లీ స్థానాలు ఉన్న మిజోరంలో గత ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్​38% ఓట్లతో 26 సీట్లు గెలుచుకుంది. వరుసగా నాలుగోసారి సీఎం పీఠం ఎక్కాలని జోరంతంగా చూస్తున్నారు. కాగా ఇక్కడ నవంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి.