
మాదాపూర్, వెలుగు: గురుపూజోత్సవం సందర్భంగా మాదాపూర్ శిల్పారామంలో ఆచార్య అభివందన కార్యక్రమంలో భాగంగా నాట్య గురువు కామేశ్వరి శిష్య బృందం ఆదివారం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆకట్టుకుంది. జతిస్వరం, రామాయణ శబ్ధం, భావయామి, కొలివైతివారంగా సాయి, ఎటువంటివాడే, తారంగం, పదవర్ణం, మోహన కల్యాణి తిల్లాన అంశాలను కల్యాణి, అక్షిత, కీర్తన, శ్రియ, సౌమ్య, అనన్య, జాస్మిత తదితరులు ప్రదర్శించి, మెప్పించారు.