కేసీఆర్ బతికుండగానే సీఎం కావాలని ఈటల యత్నం

కేసీఆర్ బతికుండగానే సీఎం కావాలని ఈటల యత్నం

మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై మొదటిసారి స్పందించారు మంత్రి హరీశ్ రావు. రాజేందర్ కు టీఆర్ఎస్ ఏం తక్కువ చేసిందన్నారు హరీశ్ రావు. ఈటల రాజేందర్ సీఎం కావాలని.. బండి సంజయ్, జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి మాట్లాడితే  ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. కేసీఆర్ అన్నం పెట్టి, రాజకీయంగా ఓనమాలు నేర్పిస్తే ఆయన బతికి ఉండగానే ఈటల రాజేందర్ సీఎం కావాలని ప్రయత్నాలు చేశారన్నారు. రైతుబంధు దండగ అని.. కళ్యాణలక్ష్మి పథకంతో ఒరిగింది ఏమీ లేదని మాట్లాడితే ..కేసీఆర్ గుండెకు ఎంత గాయం అయ్యిందో ఈటల అర్ధం చేసుకోవాలన్నారు. మంత్రి పదవి ఇచ్చాక కూడా.. టీఆర్ఎస్ పార్టీకి తామే ఓనర్ల మంటూ ఈటల ఎందుకు మాట్లాడారన్నారు హరీశ్ రావు.