టెక్నాలజీ మోసగాళ్లు.. రూ. కోటిన్నర స్వాహా..

టెక్నాలజీ మోసగాళ్లు.. రూ. కోటిన్నర   స్వాహా..

టెక్నాలజీ మోసగాళ్లు బరితెగిస్తున్నారు. సాంకేతికత ఎంత పెరుగుతుందో దానికి తగ్గట్టే నేరగాళ్లు కూడా రెచ్చిపోతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఓ మహిళా టెక్కీ దుండగుల బారినపడి  కోటి యాబై లక్షల రూపాయలను పోగొట్టుకుంది.  

 సైబర్ క్రిమినల్స్

దేశంలో  సైబర్ నేరగాళ్లు రోజుకో రీతిలో మోసాలకు పాల్పడుతున్నారు. టెక్నాలజీ ఆధారంగా కొత్త తరహ మోసాలకు సైబర్ నేరగాళ్లు పాల్పడుతున్నారు.  క్రిమినల్స్ గురించి  పోలీసులు వార్నింగ్ ఇస్తున్నా కూడా.. ప్రపంచ వ్యాప్తంగా ఏదో ఒక ప్రాంతంలో కొత్త తరహా మోసాలకు ప్రజలు గురౌతునే ఉన్నారు. ఇప్పుడు అలాంటి ఘటనే హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చింది.  

హైదరాబాద్ లో ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టులకు రేటింగ్ ఇస్తామని చెప్పి మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగి  నుంచి సుమారు కోటి యాబై లక్షల రూపాయలను దుండగులు  స్వాహా చేశారు. తాను మోసపోయినట్టుగా భావించిన టెక్కీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్‌స్టాగ్రామ్ లో టెక్కీకి పరిచయమైన నిందితులు తాము సూచించిన ఇన్ స్టా పేజీలకు రివ్యూ రేటింగ్ లు ఇవ్వాలని తెలిపింది.. అలా చేయడం వల్ల కమీషన్ ను కూడా చెల్లిస్తామని నిందితులు తెలిపారు.

పెట్టుబడి స్కీం పేరుతో ...

ఓ మహిళ టెక్కీ ఇన్ స్టాగ్రామ్ పేజీలకు రివ్యూ రేటింగ్ లు ఇచ్చింది. అయితే ఆ తర్వాత పెట్టుబడి స్కీం పేరుతో నిందితులు సాఫ్ట్ వేర్ ఉద్యోగి నుంచి డబ్బులు కాజేశారు. టెక్కీ దగ్గర నుంచి రూ. 1.50 కోట్లను సైబర్ కేటుగాళ్లు కొట్టేశారు. అయినా కూడా మహిళా టెక్కీకి డబ్బులు రాలేదు. దీంతో తాను మోసోపోయినట్టుగా గ్రహించిన సదరు మహిళా టెక్కీ పోలీసులకు ఆశ్రయించింది.  బాధితురాలి  ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రజలు ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.