MS Dhoni: ధోని ఖాతాలో మరో రికార్డు.. ఐపీఎల్‌ చరిత్రలో తొలి క్రికెటర్‌

MS Dhoni: ధోని ఖాతాలో మరో రికార్డు.. ఐపీఎల్‌ చరిత్రలో తొలి క్రికెటర్‌

టీమిండియా మాజీ కెప్టెన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటర్/వికెట్ కీపర్ ఎంఎస్‌ ధోని మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్) చరిత్రలో 150 విజయాలలో పాలు పంచుకున్న మొదటి ఆటగాడిగా నిలిచారు. ఆదివారం(ఏప్రిల్ 28) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించడంతో ధోని ఈ  మైలురాయిని చేరుకున్నారు. ఇందులో 133 విజయాలు అతను కెప్టెన్‌గా సాధించినవే. 

42 ఏళ్ల ధోని ఐపీఎల్‌లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లకు ప్రాతనిథ్యం వహించాడు. ఇప్పటివరకూ 259 మ్యాచ్‌లు ఆడగా.. 150 విజయాలు, 109 ఓటుముల్లో భాగమయ్యాడు. ధోనీ తరువాత ఈ జాబితాలో.. 133 విజయాలతో సీఎస్కే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచారు. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఈ జాబితాలో ఆరో స్థానంలో ఉన్నారు.

ఐపీఎల్‌లో అత్యధిక విజయాల్లో భాగమైన ఆటగాళ్లు

  • ఎంఎస్ ధోని: 150 విజయాలు.. (259 మ్యాచ్‌లు) 
  • రవీంద్ర జడేజా: 133 విజయాలు (235 మ్యాచ్‌లు) 
  • రోహిత్ శర్మ:133 విజయాలు (252 మ్యాచ్‌లు) 
  • దినేష్ కార్తీక్: 125 విజయాలు (252 మ్యాచ్‌లు) 
  • సురేష్ రైనా: 122 విజయాలు (205 మ్యాచ్‌లు) 
  • అంబటి రాయుడు: 121 విజయాలు (204 మ్యాచ్‌లు) 
  • విరాట్ కోహ్లీ: 116 విజయాలు (247 మ్యాచ్‌లు)