ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తే ఉద్యమిస్తాం : సీపీఐ నారాయణ

ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తే ఉద్యమిస్తాం :  సీపీఐ నారాయణ

సీఎం రేవంత్ రెడ్డి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని సీపీఐ జాతీయ కార్యద ర్శి నారాయణ అన్నారు. ఇవాళ వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా జరిగిన సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మా ట్లాడారు. రాజ్యాంగానికి మోదీ నుంచి ప్రమాదం పొంచి ఉందన్నారు. చట్టాలను మారుస్తూ అన్ని వర్గాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. 

ఏపీసీఎం జగన్ మోహన్ రెడ్డి కి కేంద్రం అండగా ఉందన్నారు. ఆర్థిక నేరస్తులను మోదీ సర్కార్ కాపాడుతుందని మండిపడ్డారు. దేశం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రాణ త్యాగం చేసిందన్నారు. అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా పని చేస్తున్నారని ఆరోపించారు. గతంలో అలా చేసిన కొందరు అధికారులు జైళ్లో ఉన్నార న్నారు. తెలంగాణ ద్రోహి కేసీఆర్ ప్రజలను నమ్మించి మోసం చేశాడని ఫైర్ అయ్యారు. ప్రజా వ్యతిరేక విధానాల వల్ల కేసీఆర్ కు ప్రజలు గుణపాఠం చెప్పారని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఆపార్టీ రాష్ట్ర కార్య దర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, తదితరులు పా ల్గొన్నారు.