హసన్పర్తి, వెలుగు: టెక్నికల్ ఫెస్ట్ విద్యార్థుల్లో కొత్త ఆలోచనల ఆవిష్కరణలకు వేదిక నిలుస్తుందని ఎస్వీఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్సిట్యూషన్స్ వైస్ చైర్పర్సన్ ఎర్రబెల్లి సువర్ణ పేర్కొన్నారు. ఆదివారం ఎస్వీఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్సిట్యూషన్ ఆధ్వర్యంలో టేక్ స్ప్రింగ్ ఫెస్ట్ రెండోరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు వైస్ చైర్పర్సన్ ఎర్రబెల్లి సువర్ణ హాజరై మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతిక విద్యతో పాటు సృజనాత్మకతను పెంపొందించుకోవాలన్నారు అనంతరం టెక్నికల్, ఇతర ఈవెంట్లలో విజేతలైన విద్యార్థులకు బహుతమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్య నిపుణులు మమత, హెల్త్ కేర్ సెంటర్ డాక్టర్ మాధవి, ఉషా కిరణ్, హర్షిని తదితరులు పాల్గొన్నారు
