
ప్రశాంత్ వర్మ(Prashanth Varma).. ఇప్పుడిది పేరు కాదు ఒక బ్రాండ్. తీసింది నాలుగు సినిమాలు మాత్రమే. కానీ, ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు ఈ దర్శకుడు. ఇటీవల ఈ దర్శకుడి నుండి వచ్చిన మూవీ హనుమాన్. సూపర్ హీరో కాన్సెప్ట్ తో హనుమంతుని బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపించి శభాష్ అనిపించుకుంది.
ప్రస్తుతం ప్రశాంత్ వర్మ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేస్తూ వస్తున్నాడు. హనుమాన్ క్లైమాక్స్ లోనే జై హనుమాన్ ఉంటుందని రివీల్ చేస్తూనే ప్రకటించాడు.అంతేకాదు జై హనుమాన్ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు కూడా అనౌన్స్ చేశాడు.
ఈ ఒక్క సినిమానే కాకుండా..అధీర(Adhira) అనే సినిమా కూడా రాబోతుందని తెలిపాడు. ఈ సినిమాతో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కొడుకు కళ్యాణ్ దాసరి(Kalyan Dasari) హీరోగా పరిచయం అవుతున్నారు. ఇక అంతేకాకుండా..అనుపమతో ఆక్టోపస్ కూడా ఉంటుందని కూడా తెలిపాడు.
ఇక అసలు విషయానికి వస్తే..ప్రశాంత్ వర్మ బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍వీర్ సింగ్(Ranveer Singh)తో ప్రశాంత్ ఓ చిత్రం తెరకెక్కించనున్నారు. ఇప్పటికే రణ్‍వీర్ సింగ్‍కు కథ కూడా చెప్పగా అది ఓకే అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ కూడా షూరుకానుందని టాక్. అయితే, రణ్‍వీర్ - ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కనున్న ఈ మూవీకి టైటిల్ కూడా ఫిక్స్ అయిందని తాజాగా సమాచారం. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది.
కాగా,ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఆల్రెడీ ఏప్రిల్‍లోనే జరిగినట్లు టాక్. ఈ మూవీ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే రాక్షస్ అనే పేరును డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఫిక్స్ చేసుకున్నారని సమాచారం. త్వరలో ఈ సినిమాకి సంబండించిన అఫిసియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.
డైరెక్టర్ ప్రశాంత్ వరుసపెట్టి సినిమాలు ప్రకటిస్తున్నాడు..మరి ఇందులో ఈ మూవీ ముందుగా రానుందో తెలియాల్సి ఉంది. ఈ మూవీ పీరియడ్ డ్రామాగా ఉండనుందని టాక్. అంతేకాకుండా పురాణాల టచ్ కూడా ఉంటుందని టాక్. భారత స్వాతంత్య్రానికి ముందు కాలం నాటి బ్రాక్‍డ్రాప్‍లో ఈ చిత్రం ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో రణ్‍వీర్ క్యారెక్టర్ నెగెటివ్ షేడ్స్‌తో ఉంటుందని సమాచారం. త్వరలోనే ఈ విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.