హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ తీర్పుపై బీఆర్‌ఎస్ దాఖలు చేసిన పిటిషన్లకు 3 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు గురువారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
బీఆర్‌ఎస్ తరఫున ఎన్నికై కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలె యాదయ్య, కడియం శ్రీహరి, బండ్ల కష్ణమోహన్ రెడ్డి, టి.ప్రకాశ్ గౌడ్, ఎ.గాంధీ, తెల్లం వెంకట్ రావు, సంజయ్ కుమార్, గూడెం మహిపాల్ రెడ్డిపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ స్పీకర్ వెలువరించిన తీర్పును బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జి.జగదీశ్ రెడ్డి, కేపీ వివేకానంద, కె.సంజయ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీహెచ్ ప్రభాకర్, పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి.. హైకోర్టులో సవాలు చేసిన విషయం తెలిసిందే.

