ఒలింపిక్స్ .. డిస్కస్ త్రో లో ఫైనల్ కు కమల్ ప్రీత్ కౌర్

ఒలింపిక్స్ .. డిస్కస్ త్రో లో ఫైనల్ కు కమల్ ప్రీత్ కౌర్

ఒలింపిక్స్ మహిళల డిస్కస్ త్రో లో ఫైనల్ కు చేరింది కమల్ ప్రీత్ కౌర్. ఫస్ట్ అటెంప్ట్ లో 60.29 మీటర్ల దూరం విసిరిన కమల్ ప్రీత్ కౌర్...రెండో ప్రయత్నంలో 63.97 మీటర్ల దూరం విసిరింది. ఇక మూడో ప్రయత్నంలో 64 మీటర్ల దూరం విసిరింది. క్వాలిఫికేషన్ రౌండ్ ముగిసేసరికి కమల్ ప్రీత్ కౌర్ రెండో స్థానంలో నిలవగా...అమెరికన్ ప్లేయర్ అల్మన్ వలరీ ఫస్ట్ ప్లేసు దక్కించుకుంది. సీమా పునియా 16వ స్థానంతో సరిపెట్టుకుంది. క్వాలిఫికేషన్ రౌండ్ లో ఫస్ట్ 12 ప్లేసుల్లో నిలిచిన వారిని ఫైనల్ కు ఎంపిక చేశారు. సోమవారం సాయంత్రం డిస్కస్ త్రో ఫైనల్ జరగనుంది.