సింగర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కొత్త మలుపు’. భైరవి ఆర్థ్యా హీరోయిన్‌గా నటించింది. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వం వహించగా, తాటి బాలకృష్ణ నిర్మించారు. జూన్ 12న సినిమా విడుదల కానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా విడుదలవుతోంది.
తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను సీనియర్ దర్శకులు ఏ కోదండరామిరెడ్డి రిలీజ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో లవ్, సస్పెన్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు అన్ని ఎలిమెంట్స్ ఉంటాయని మేకర్స్ తెలియజేశారు.
ఆకాష్,భైరవి బావ మరదళ్ల పాత్రల్లో కనిపించనున్నారని వీరి పాత్రలు అందర్నీ ఆకట్టుకున్నాయని అన్నారు. రఘుబాబు, పృథ్వీరాజ్, ప్రభావతి ఇతర కీలక పాత్రలు పోషించారు. యశ్వంత్ నాగ్ సంగీతం అందించాడు.
