కుంభంకు సముచితం స్థానం ఇస్తం కాంగ్రెస్లో సమస్యలు సహజం

కుంభంకు సముచితం స్థానం ఇస్తం కాంగ్రెస్లో సమస్యలు సహజం

కుంభం అనిల్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో సముచితమైన స్థానం కల్పిస్తామన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.  అధిష్టానం ఆదేశాలతో అనిల్ను పార్టీలోకి ఆహ్వానించామని చెప్పారు.  
కుంభం అనిల్ కుమార్ రెడ్డి  2018 ఎన్నికల్లో ఓడినా ..కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చారని చెప్పారు.  కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన యాదాద్రి -భువనగిరి డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తిరిగి సొంతగూటికి చేరారు.  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతీ కార్యక్రమాన్ని అనిల్ విజయవంతం చేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు సహజమన్నారు. కాంగ్రెస్ సర్వేలో కుంభం అనిల్ కుమార్ రెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకోవాలని తేలిందన్నారు. అందుకే కుంభంను కాంగ్రెస్ లోకి ఆహ్వానించామని చెప్పారు. దీనికి తోడు భువనగిరి నియోజకవర్గంలో కార్యకర్తల ఒత్తిడితో కుంభం అనిల్ సొంతగూటికి చేరారని తెలిపారు. భువనగరి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయమని చెప్పారు. ఈ క్షణం నుంచి భువనగిరి కార్యకర్తలకు అనిల్ అండగా ఉంటారని తెలిపారు.

కొందరు తినడం మానేసిండ్రు

కాంగ్రెస్ పార్టీ మారడంతో తన కార్యకర్తలు మానసికంగా ఇబ్బంది పడ్డారన్నారు కుంభం అనిల్ రెడ్డి. కొందరు తినడమే మానేసిండ్రని చెప్పారు. సరిగ్గా రెండు నెలలు బీఆర్ఎస్ లో ఉన్నానని...తొందర పడి తప్పుడు నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. భువనగిరిలో కాంగ్రెస్ క్యాడర్ బలంగా ఉందన్నారు. తనను మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని క్యాడర్ ఒత్తిడి చేశారని వెల్లడించారు. కేసి వేణుగోపాల్ కూడా తనతో మాట్లాడి రమన్నారని తెలిపారు. డైనమిక్ పీసీసీ రేవంత్ తో కలిసి పనిచేసే అవకాశం మళ్లీ వచ్చిందని...కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు.