జాబ్​ వెతుక్కుంటున్నారా.. ఇవి చాలా ముఖ్యం

జాబ్​ వెతుక్కుంటున్నారా.. ఇవి చాలా ముఖ్యం

ఏ పనైనా మనసుపెట్టి చేస్తేనే రిజల్ట్ బాగుంటుంది. జిమ్​లో​ వర్కవుటైనా, జాబ్​ ట్రయలైనా ఇదే నియమం​ వర్తిస్తుంది. కొత్తగా జాబ్​ వెతుక్కునేవాళ్లు  మైండ్​ని ఫ్రెష్​గా, యాక్టివ్​గా ఉంచుకోవాలి. కొత్త స్కిల్స్​ నేర్చుకోవడం, మెంటల్​గా యాక్టివ్​గా ఉండడం చాలా ముఖ్యం.

అందుకు ఏం చేయాలంటే...
మిగతా వాళ్ల కంటే స్పెషల్​గా ఉండాలంటే కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలి. కొన్ని వెబ్​సైట్లు ఫ్రీ లాంగ్వేజ్​ కోర్సులు అందిస్తున్నాయి. ఇప్పటివరకు చేసిన జాబ్ ప్రయత్నాలు ఎందుకు ఫెయిల్​ అయ్యాలో ఆలోచించుకోవాలి. మళ్లీ  అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. కెరీర్​ ఇదే అనుకున్న ఫీల్డ్​లో ఇన్ఫర్మేషన్​ అప్​–టు–డేట్​ ఉండాలి. ఫ్రీ నెట్​వర్కింగ్ ఈవెంట్స్​లో భాగమవ్వాలి. స్కిల్స్ నేర్చుకునేందుకు ఎక్స్​ట్రా టైం వర్క్​ చేయాలి.  జాబ్​ వెతుక్కునే  టైంలో టీవీ చూస్తూ, శ్నాక్స్​ తింటూ కూర్చోవద్దు.  వీటి బదులు మైండ్​ రిలాక్స్​ చేసే గేమ్స్​ ఆడాలి. ఇంటి దగ్గరే వర్కవుట్స్​ చేయాలి.  నచ్చిన మ్యూజిక్​ పెట్టుకుని కొంచెం సేపు డాన్స్ చేయాలి. మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు స్ఫూర్తినిచ్చే ఆర్టికల్స్, బుక్స్​, కోటేషన్స్​​ చదవాలి.
రూంలో వస్తువులన్నీ ఒక ఆర్డర్​లో పెట్టుకోవాలి. అవసరం లేనివి, రీ–సైకిల్, డొనేట్​ చేయడానికి వీలైన వస్తువులు, డ్రెస్​ లాంటివి చక్కగా సర్దేయాలి. అప్పుడే గది శుభ్రంగా ఉంటుంది. ప్రశాంతంగా ఆలోచించడం సాధ్యమవుతుంది.