బ్యాక్ ఫ్లిప్ తో వైరల్ అవుదామనుకున్నాడు.. బ్యాలెన్స్ తప్పి ఫూల్ అయ్యాడు

బ్యాక్ ఫ్లిప్ తో వైరల్ అవుదామనుకున్నాడు.. బ్యాలెన్స్ తప్పి ఫూల్ అయ్యాడు

ఢిల్లీ మెట్రో మరో సారి వార్తల్లో నిలిచింది. రైళ్లో రీల్స్, రొమాన్స్ కు సంబంధించిన వీడియోలు ఇప్పటికే వైరల్ కాగా.. ఇప్పుడు ఓ యువకుడు బ్యాక్ ఫ్లిప్ స్టంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) రైలు కోచ్‌లలో వీడియోలను చిత్రీకరించడంపై నిషేధం విధించినప్పటికీ ఈ తరహా ఘటనలు మాత్రం పునరావృతం అవుతూనే ఉన్నాయి.

ప్రస్తుతం వైరల్ అవుతోన్న ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో 'చమన్ ఫ్లిప్పర్' అనే పేజీలో షేర్ అయింది. వీడియో ప్రారంభంలో అతను ఫ్లిప్ కు రెడీ అవుతున్నట్టు చూపించింది. అందరూ చూస్తుండగానే..  అతను బ్యాక్ ఫ్లిప్ జంప్ చేసి, ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి.. తల నేలకు తాకుతుంది. వీడియో చివర్లో, అతను నొప్పితో తల పట్టుకున్నట్లు చూడవచ్చు. ఈ పోస్టును పంచుకుంటూ నేను మెట్రోలో గాయపడ్డాను అని ఆ వ్యక్తి రాసుకువచ్చాడు.

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు అతని స్టంట్స్ ను విమర్శిస్తున్నారు. చాలా మంది.. మెట్రోలో ఇలాంటి వీడియోలను ఎందుకు చిత్రీకరిస్తున్నారని ఆశ్చర్యపోయారు. మరికొందరు అతన్ని ఎగతాళి చేయగా, ఇంకొందరు మాత్రం అతనలా పడడంతో ఆందోళన వ్యక్తం చేశారు. "ఈ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించండి. మెట్రోలో ఇలాంటి కార్యకలాపాలు చేయడం చాలా ప్రమాదకరం’’ అని, "మీకు ఎలా చేయాలో తెలియక ఇలాంటి విన్యాసాలు చేస్తున్నారు. అసలు ఇలా చేయమని ఎవరు అడిగారు? నిన్ను నువ్వు ఫూల్ చేసుకున్నావు’’ అని కొందరు కామెంట్ చేస్తున్నారు.