జగిత్యాల/నిజామాబాద్, వెలుగు: జగిత్యాలకు చెందిన అబ్దుల్ హమీద్ ఏడేళ్ల కూతురు జూబీయా లివర్ సమస్యతో బాధపడుతోంది. లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు రూ.40 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో పాప తల్లిదండ్రులు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను కలిశారు. ఎంపీ తన ఫౌండేషన్ తరఫున రూ.2 లక్షల సాయం చేశారు. ఎంపీతోపాటు కొన్ని సంస్థలు సాయం చేయడంతో రూ.20 లక్షలు సమకూరాయి. దాంతో హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో పాపకు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగింది. పాపను ఎంపీ అర్వింద్ శుక్రవారం కలిశారు. డాక్టర్లతో మాట్లాడారు. తమ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు 153 మంది చిన్నారుల వైద్యానికి సాయం చేసినట్లు ఎంపీ తెలిపారు.

