V6 News

ఈ బుడ్డోడే నాకు కోచింగ్‌‌ ఇచ్చిండు..

ఈ బుడ్డోడే నాకు  కోచింగ్‌‌ ఇచ్చిండు..


పారిస్‌‌:  ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌లో టైటిల్‌‌ నెగ్గి రికార్డు క్రియేట్‌‌ చేసిన నొవాక్‌‌ జొకోవిచ్.. ఫైనల్లో ఓ బుడ్డోడు తనకు కోచింగ్‌‌ ఇచ్చాడని చెప్పాడు. అతని ఎంకరేజ్‌‌మెంట్‌‌, సూచనల వల్లే మ్యాచ్‌‌ నెగ్గానని అన్నాడు.  మ్యాచ్‌‌ ముగిసిన వెంటనే  తన రాకెట్‌‌ను యంగ్‌‌ ఫ్యాన్‌‌కు గిఫ్ట్‌‌గా ఇచ్చాడు. ‘నేను తొలి రెండు సెట్లు ఓడిపోయినప్పటి నుంచి ఆ బుడ్డోడు నాకు ఏదో ఒకటి చెబుతూనే ఉన్నాడు. నన్ను ఎంకరేజ్‌‌ చేశాడు. నిజానికి తను నాకు కొన్ని ప్లాన్స్‌‌ చెప్పాడు. సర్వ్‌‌ నిలబెట్టుకో.. తొలుత బాల్‌‌ను నెమ్మదిగా ఆడు.. తర్వాత జోరు చూపించు... అతని (సిట్సిపాస్‌‌) బ్యాక్‌‌హ్యాండ్‌‌పై షాట్లు కొట్టు అని అరుస్తూనే ఉన్నాడు. ఒకరకంగా తను నాకు కోచింగ్‌‌ ఇచ్చాడు. అది నాకు బాగా అనిపించింది.  నాకు సపోర్ట్‌‌ ఇచ్చినందుకు కృతజ్ఞతగా అతనికి నా రాకెట్‌‌ ఇచ్చా’ అని జొకో వెల్లడించాడు.