ఎన్నికల కోసమే పెట్రో రేట్ల తగ్గింపు

ఎన్నికల కోసమే పెట్రో రేట్ల తగ్గింపు
  • కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్  

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసమే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించిందని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘‘ఎన్నికల కోసమే కేంద్రం పెట్రోల్ రేటును 17 పైసలు, డీజిల్ రేటును 18 పైసలు తగ్గించింది. ఇంత మొత్తం పొదుపుతో మీరేం చేస్తారు?” అని రాహుల్ ఆదివారం ట్వీట్ చేశారు. 
తమిళనాడు సీఎం కేంద్రానికి తలవంచిండు.. 
అన్నాడీఎంకే టాప్ లీడర్, తమిళనాడు సీఎం పళనిస్వామిపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎదుట పళనిస్వామి తలవంచారని మండిపడ్డారు. పళనిస్వామి అవినీతికి పాల్పడ్డారని, అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్రం ఎదుట తలవంచారని ఆరోపించారు. ఆదివారం చెన్నైలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ‘ప్రజల సొమ్మును దోచుకున్న పళనిస్వామి అవినీతిని ప్రధాని మోడీ ఆసరాగా తీసుకున్నారు. ఆయనను ట్రాప్ చేశారు. ఆయన తన కాళ్లకు మొక్కేలా చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రాన్ని కంట్రోల్ చేస్తున్నారు” అని రాహుల్ 
ఆరోపించారు.