తెలుగు అబ్బాయినే వివాహం చేసుకో.. ఇక్కడే సెటిల్ అవ్వు.. మృణాల్ పెళ్లిపై అల్లు అరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

తెలుగు అబ్బాయినే వివాహం చేసుకో.. ఇక్కడే సెటిల్ అవ్వు.. మృణాల్ పెళ్లిపై అల్లు అరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ తన కెరీర్‌లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నారు. ఆయన లేటెస్ట్ గా నటించిన చిత్రం 'డెకాయిట్'  ఏప్రిల్ 10న  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్డ్ టాక్ ను సొంత చేసుకున్నా తొలివారం మంచి వసూళ్లను సాధించింది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 34 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సందర్భంగా చిత్ర బృందం నిర్వహించిన విజయోత్సవ వేడుకకు అగ్ర నిర్మాత అల్లు అరవింద్, దర్శకులు నాగ్ అశ్విన్, నందిని రెడ్డి, నిర్మాతలు బన్నీ వాసు, స్వప్న దత్ వంటి ప్రముఖులు హాజరై సందడి చేశారు.

శేష్ నిజంగానే 'డెకాయిట్'

ఈ వేడుకలో అల్లు అరవింద్ తనదైన శైలిలో సరదాగా మాట్లాడుతూ.. శేష్ నిజంగానే పేరుకు తగ్గట్టుగా 'డెకాయిట్' లాంటివాడు. మంచి మంచి కథలను పట్టుకోవడంలోనే కాదు, ఆ కథలతో ప్రేక్షకుల మనసులను దోచుకోవడంలోనూ ఆయన దిట్ట. ఈ సినిమాకు నిర్మాత సుప్రియ యార్లగడ్డ పడిన తపన అభినందనీయం అని ప్రశంసించారు. డైరెక్టర్ షానిల్ డియో ఈ సినిమాలో క్రైమ్, లవ్ స్టోరీని అద్భుతంగా మిళితం చేశారని, ముఖ్యంగా ఎడిటర్ పవన్ కళ్యాణ్ పనితీరు బాగుందని  కొనియాడారు.

సీత కంటే సరస్వతి మెప్పించింది!

హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి మాట్లాడుతూ అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మృణాల్‌కు 'సీతారామం'లో సీతగా మంచి పేరు వచ్చింది. కానీ 'డెకాయిట్'లో సరస్వతి పాత్రలో ఆమె నటన సీత పాత్రను మించిపోయింది. ఎమోషనల్ సీన్స్‌లో ఆమె కళ్లు పలికించే హావభావాలు అద్భుతం అని మెచ్చుకున్నారు.

 

►ALSO READ | పవన్ కళ్యాణ్, నిహారిక వ్యక్తిగత జీవితంపై చీప్ జోకులు.. కమెడియన్‌పై మెగా ఫ్యాన్స్ సీరియస్!

 

తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకో..

అయితే మృణాల్ వ్యక్తిగత జీవితంపై అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది.  మృణాల్ నువ్వు ఏదో ఒక తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అయిపోవాలి అని అన్నారు. గతంలో ఒక వేడుకలో లావణ్య త్రిపాఠికి కూడా ఆయన ఇలాగే తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని దీవించా... ఆ తర్వాత లావణ్య, మెగా హీరో వరుణ్ తేజ్‌ని పెళ్లి చేసుకుందని గుర్తు చేశారు.  అరవింద్ అలా అనగానే మృణాల్ సిగ్గుపడుతూ నవ్వడం వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్ తెగ వైరల్ అవుతుంది. అటు మృణాల్ కూడా త్వరలో తెలుగింటి కోడలు అవ్వడం ఖాయం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  మొత్తానికి 'డెకాయిట్' సినిమా విజయం ఒక ఎత్తు అయితే, మృణాల్ పెళ్లిపై అల్లు అరవింద్ చేసిన హింట్ ఇప్పుడు ఇండస్ట్రీలో సరికొత్త చర్చకు దారితీసింది.  మరి మృణాల్ త్వరలో తన 'మిస్టర్ రైట్' గురించి ఏమైనా ప్రకటిస్తుందేమో చూడాలి.