పవన్ కళ్యాణ్, నిహారిక వ్యక్తిగత జీవితంపై చీప్ జోకులు.. కమెడియన్‌పై మెగా ఫ్యాన్స్ సీరియస్!

పవన్ కళ్యాణ్, నిహారిక వ్యక్తిగత జీవితంపై చీప్ జోకులు.. కమెడియన్‌పై మెగా ఫ్యాన్స్ సీరియస్!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే రచ్చ.. అదే స్టాండప్ కమెడియన్ అనుదీప్ కాటికాల వైరల్ వీడియో. సాధారణంగా హాస్యం అనేది నవ్వులు పూయించాలి, కానీ అనుదీప్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు మెగా అభిమానుల్లో  తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. ‘కామెడీకి కూడా హద్దులు ఉండాలి’ అంటూ నెటిజన్లు అతడిపై విరుచుకుపడుతున్నారు. అతడి జోకులు తీవ్ర వివాదంగా మారాయి.

అసలేం జరిగింది?

వైరల్ అవుతున్న ఆ వీడియో క్లిప్‌లో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై అనుదీప్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. నేను పవన్ కళ్యాణ్ గారి నుండి నేర్చుకున్న ముఖ్యమైన విషయం ఏమిటంటే.. భార్యకు విడాకులు ఎలా ఇవ్వాలి అనేది. మగవారందరూ ఆయనను చూసి ఇది నేర్చుకోవాలి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇంతటితో ఆగకుండా, మెగా ఫ్యామిలీకి చెందిన నిహారిక కొణిదెల గురించి ప్రస్తావిస్తూ.. నేను గనుక నిహారిక స్థానంలో ఉంటే, కచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికే కాల్ చేస్తాను. ఎందుకంటే ఆ ఫ్యామిలీలో విడాకుల విషయంలో అత్యధిక అనుభవం ఉన్న వ్యక్తి ఆయనే కదా.. అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. అలాగే రామ్ చరణ్ , ఉపాసనల ఆర్థిక స్థితిగతులపై కూడా అనుదీప్ చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్‌కు మింగుడుపడటం లేదు. రాజకీయంగా, సినీపరంగా ఎంతో ఎత్తులో ఉన్న వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. 

మండిపడుతున్న ఫ్యాన్స్

ఈ వీడియోపై ఎక్స్  వేదికగా అభిమానులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఆయన ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అన్న గౌరవం కూడా లేకుండా, కేవలం అటెన్షన్ కోసం ఇలాంటి నీచమైన జోకులు వేస్తారా? అని మండిపడుతున్నారు. వ్యక్తిగత జీవితాన్ని కించపరచడం కామెడీ కాదు, అది అజ్ఞానం అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. పరిశ్రమ వర్గాలు సైతం అనుదీప్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే, దీనిపై అనుదీప్ కాటికాల ఇప్పటివరకు స్పందించలేదు.

 ‘జైలర్ 2’లో పవన్ ?

ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే, మరోవైపు సినిమాలతోనూ పవన్ సందడి చేస్తున్నారు. ఇటీవల విడుదలైన 'ఉస్తాద్ భగత్ సింగ్' బాక్సాఫీస్ వద్ద అశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. త్వరలోనే ఈ మూవీ  ఓటిటిలో సందడి చేయనుంది. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’లో పవన్ కళ్యాణ్ ఒక పవర్ ఫుల్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారనే వార్త ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతోంది. గతంలో ఈ పాత్ర కోసం షారుఖ్ ఖాన్ పేరు వినిపించినప్పటికీ, ఇప్పుడు పవన్ పేరు ఖరారైనట్లు టాక్ వినిపిస్తోంది.