28 ఏళ్ల వ్యక్తి.. పేరు దిలీప్. జిమ్ ట్రైనర్. కండలు తిరిగే బాడీ.. సిక్స్ ప్యాక్ ఫిట్ నెస్. అంతేనా కర్నాటక రాష్ట్ర ఫిట్ నెస్ ట్రైనర్ గా గుర్తింపు. అలాంటి జిమ్ ట్రైనర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సూసైడ్ వెనక పెద్ద లవ్ ట్రాక్ నడిచిందని.. జిమ్ కు వచ్చిన ఓ మహిళ పాత్ర ఉందని కుటుంబ సభ్యులు కంప్లయింట్ చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. కర్నాటక స్టేట్ జిమ్ ట్రైనర్ దిలీప్ ఆత్మహత్య మిస్టరీ ఏంటో పూర్తిగా తెలుసుకుందామా..
రాష్ట్ర స్థాయి ఫిట్ నెస్ ట్రైనర్ గా గుర్తింపు పొందిన దిలీప్ ఆదివారం ( ఏప్రిల్ 12 ) రాత్రి తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. దిలీప్ రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చాడని.. తెల్లారేసరికి చుస్తే ఆత్మహత్య చేసుకున్నాడని యోగిత అనే మహిళ దిలీప్ సోదరికి ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
దిలీప్ మరణానికి 42 ఏళ్ళ వివాహిత మహిళ కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు అతని కుటుంబసభ్యులు. దిలీప్ కి 42 ఏళ్ళ మహిళ జిమ్ లో పరిచయం అయ్యిందని.. ఆ పరిచయం కాస్తా ఇద్దరి మధ్య క్లోజ్ రిలేషన్ షిప్ గా మారిందని తెలిపారు కుటుంబసభ్యులు. ఆ మహిళ డబ్బులు, ఆస్తి కోసం దిలీప్ ను బ్లాక్ మెయిల్ చేసేదని ఫిర్యాదులో పేర్కొన్నారు కుటుంబసభ్యులు.
Also Read : జీతాల పెంపు కోసం కార్మికుల విధ్వంసం
ఈ విషయం ఇంతకుముందే పోలీసుల దృష్టికి వెళ్లిందని, ఆ తర్వాత మహిళ భర్త సమక్షంలో పరస్పర అంగీకారంతో సమస్యను పరిష్కరించుకున్నారని, అయినప్పటికీ బ్లాక్ మెయిల్ చేయడం ఆపలేదని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దిలీప్ ఇంట్లో ఆధారాలు సేకరించారు పోలీసులు, ఫోరెన్సిక్ టీం. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
