పెళ్లయ్యిన నెల రోజులకే వ్యాపారవేత్త సుదీప్ ఆత్మహత్య కేసులో.. భార్య సౌమ్య అరెస్ట్

పెళ్లయ్యిన నెల రోజులకే వ్యాపారవేత్త సుదీప్ ఆత్మహత్య కేసులో.. భార్య సౌమ్య అరెస్ట్

అతనో వ్యాపారవేత్త.. యంగ్ బిజినెస్ మెన్. అతని పేరు సుదీప్. కర్నాటక రాష్ట్రం. 2026, ఫిబ్రవరి 17న సౌమ్య అనే యువతితో పెళ్లయ్యింది. అంటే పెళ్లి జరిగి జస్ట్ నెలన్నర రోజులు  మాత్రమే. పెళ్లి తర్వాత ఈ జంట కర్కల మండలంలోని బంగలేగుడ్డే కాజే ఏరియాలో సెపరేట్ కాపురం పెట్టారు. నెలన్నర రోజులకే భార్య చిత్ర హింసలు, వేధింపులు భరించలేకపోయాడు.. ఇంకేం చేస్తాడు పురుగుల మందు తాగాడు.. ఆ తర్వాత ఏం జరిగింది అనే పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

యువ వ్యాపారవేత్తగా.. బాగా డబ్బులు సంపాదిస్తు్న్న సుదీప్.. హిమ్ముజే కాజే ప్రాంతానికి చెందిన సౌమ్య అనే యువతిని ఫిబ్రవరి 17న పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయిన తర్వాత రోజు నుంచే భార్య సౌమ్య వేధింపులకు గురి చేస్తుంది. వేరు కాపురం పెట్టినా హింస ఆగలేదు. 

ఈ క్రమంలోనే మార్చి 17వ తేదీన సుదీప్.. తన తల్లితో కలిసి కారులో బయలుదేరాడు. ఓ పూజలో పాల్గొనేందుకు తల్లీకొడుకులు వెళుతున్నాడు. తల్లితో తన భర్త సుదీప్ వెళ్లటాన్ని జీర్ణించుకోలేకపోయింది భార్య సౌమ్య. వాళ్ల కారు వెనకాలే తన స్కూటీ వాహనంతో వెళ్లింది. నెల్యాడి టౌన్ సమీపంలోకి రాగానే.. తన స్కూటీని కారుకు అడ్డంగా పెట్టింది. నడి రోడ్డుపైనే.. అందరూ చూస్తుండగానే భర్త సుదీప్, అత్తను పెద్ద పెద్ద అరుపులు, కేకలు వేస్తూ తిట్టింది. రోడ్డుపై అందరూ చూస్తున్నారని.. ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం అని.. పూజ కోసం గుడికి వెళుతున్నామని.. ఇప్పుడు గొడవ చేయొద్దని భార్య సౌమ్యకు ఎంతో నచ్చచెప్పారు ఇద్దరూ.. 

ఏ మాత్రం వెనక్కి తగ్గని భార్య సౌమ్య.. నడి రోడ్డుపై అల్లరి చేసింది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన భర్త సుదీప్.. నడి రోడ్డుపై జరిగిన గొడవపై, భార్య సౌమ్య తీరుపై మండిపడ్డాడు. పెళ్లి అయిన తర్వాత రోజు నుంచి.. 40 రోజులుగా భార్య చిత్రహింసలు, వేధింపులు, గొడవలను తట్టుకోలేకపోయిన సుదీప్.. మార్చి 22వ తేదీన పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని గమనించిన భార్య సౌమ్య.. భర్త తరపు బంధువులకు సమాచారం ఇచ్చింది. వాళ్లు వెంటనే ఇంటికి వెళ్లి సుదీప్ ను కర్కళలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం విషమంగా మారటంతో ఉడిపిలోని మరో ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మంగళూరు తరలించారు.

►ALSO READ | గుళ్లో పెళ్లి చేసుకుని ఆటోలో ఇంటికెళ్తున్న కొత్త జంటను పగబట్టిన విధి.. ఎలా చనిపోయారో చూడండి !

మంగళూరులోని చికిత్స పొందుతున్న సుదీప్.. మార్చి 29వ తేదీన చనిపోయాడు. అంత్యక్రియల తర్వాత భార్య సౌమ్య వేధింపుల వల్లే నా కొడుకు సుదీప్ ఆత్మహత్య చేసుకున్నాడని.. ఇది ఆత్మహత్య కాదు హత్య అంటూ అతని తండ్రి పోలీస్ కంప్లయింట్ ఇచ్చాడు. 

విచారణ చేసిన పోలీసులు.. భార్య సౌమ్య వేధింపులకు సంబంధించి ఆధారాలు సేకరించారు. సుదీప్ తల్లిదండ్రులు, బంధువులు ఇచ్చిన సమాచారం. ఆధారాలతో పోలీసులు ఓ నిర్థారణకు వచ్చారు. సౌమ్య వేధింపుల వల్లే సుదీప్ ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 11వ తేదీన అరెస్ట్ చేశారు పోలీసులు.

విచారణ తర్వాత సౌమ్యను కోర్టులో హాజరుపరచగా.. జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు.

తన కొడుకు చావును.. అతని భార్య సౌమ్యనే కారణం అని.. పెళ్లయిన మరుక్షణం నుంచి వేధింపులు, గొడవలు  పెట్టుకోవటంతో తీవ్ర మానసిక క్షోభకు గురైనట్లు సుదీప్ పేరంట్స్ చెబుతున్నారు. నా కొడుకు చావుకు కారణం అయిన సౌమ్యకు కఠిన శిక్ష పడాలని.. అప్పటి వరకు న్యాయ పోరాటం ఆగదని చెబుతున్నారు సుదీప్ పేరంట్స్